Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

సైలెంట్‌గా వచ్చిన ‘బత్తా’.. విజయ్ సేతుపతి సత్తా ఏంటో చూపించింది. బాలాజీ తరంతీరన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శబరి, లిజోమల్‌ జోస్‌ ప్రధాన పాత్రధారులు. గత వారం వచ్చిన ఈ సినిమా విజయ్‌కి మంచి విజయం అందించింది అని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆయన జోరు ఈ వారం కూడా భారీగానే సాగుతుంది అని చెబుతున్నారు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే విజయ్‌ చేతిలో ఇప్పుడు 10కిపైగా సినిమాలు ఉన్నాయి. ఆ జోరు సంగతి చూస్తే..

Vijay Sethupathi

* రజనీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘జైలర్’ సీక్వెల్‌‌ ‘జైలర్‌ 2’ సినిమాలో విజయ్ సేతుపతి ఒక అతిథి పాత్రలో కనిపించనున్నాడు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ‘పేట’ సినిమా తర్వాత రజనీతో సేతుపతి నటిస్తున్న చిత్రమిది.

* విజయ్‌ సేతుపతి సత్తా ఏంటో ఎన్నో ఏళ్ల క్రితమే నిరూపించిన సినిమా ‘సూపర్ డీలక్స్’ సినిమా తర్వాత ఆ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. రాజ్ బి.శెట్టి, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ సినిమానే ‘పాకెట్‌ నోవల్‌’. త్యాగరాజన్ కుమారరాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

* పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి నటించిన చిత్రం ‘స్లమ్‌డాగ్ (33 టెంపుల్ రోడ్)’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా ఇది. టబు, సంయుక్తా ముఖ్య పాత్రల్లో నటించారు. మురికివాడల నేపథ్యంలో సాగే కథ ఇది.

* మిస్కిన్‌ దర్శత్వంలో ‘ట్రైన్‌’ అనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్‌. డార్క్ సైకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మిస్కిన్ సంగీతం కూడా అందిస్తున్నారు. డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

* విజయ్‌ సేతుపతి – సాయిపల్లవి – మణిరత్నం.. ఈ కాంబినేషన్‌లో గురించి చాలా ఏళ్లుగా జనాలు వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ఈ సినిమాకు ‘ఇంటివెల్లం’ అనే పేరు పెట్టారు. తెలుగులో ‘అల్లం బెల్లం’ అని అర్థం. ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

* కృతికా ఉదయనిధి దర్శకతవంలో విజయ్ సేతుపతి ఓ రా అండ్ రస్టిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పుదుచ్చేరిలోని తీర ప్రాంతాలలో జరుగుతోంది. విజయ్‌ ఇప్పటివరకు కనిపించని పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడని టాక్‌ నడుస్తోంది.

* హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటులు కూడా నటిస్తారట.

* బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా హాలీవుడ్‌లో కూడా రీమేక్‌ అవ్వబోతున్న సినిమా ‘మహారాజా’. ఈ సినిమాకు సీక్వెల్ లేదా అదే జోనర్లో మరో కొత్త కథను సిద్ధం చేస్తున్నారట దర్శకుడు నితిలన్ స్వామినాథన్.

* ‘అరసన్’ సినిమా నుండి తప్పుకున్న విజయ్‌ సేతుపతి.. వెట్రిమారన్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్‌ సినిమాకు రెడీ అయ్యాడు. చారిత్రక కథ, సోషల్ ఫాంటసీ కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

* బాలా స్టయిల్‌ రస్టిక్ ఇంటెన్సిటీ కథతో విజయ్ సేతుపతి ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారని సమాచారం.

బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus