The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

ప్యారడైజ్ (The Paradise) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ చూస్తూనే ఉన్నాం. ‘A’ రేటింగ్ ఇచ్చినప్పటికీ.. ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ పడింది లేదు. అయితే ప్యారడైజ్ సినిమా కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి:

The Paradise Movie

1. హిట్టు కాంబినేషన్

దసరా కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్లు కొల్లగొట్టింది. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి టాక్ తెచ్చుకుంది.

2. నాని కొత్త అవతార్

ఇప్పటివరకు మనం హీరో నానిని నేచురల్ లుక్స్‌లో ఎక్కువగా చూశాం. దసరా సినిమాలో రస్టిక్ లుక్‌లో కనిపించినా.. పెర్ఫార్మెన్స్ విషయంలో ‘ఔట్ ఆఫ్ ది బాక్స్’ వెళ్ళలేదు. కానీ ఈ సినిమాలో వైవిధ్యమైన లుక్‌లో కనిపిస్తున్నాడు. పాత్ర కూడా చాలా బోల్డ్‌గా, అగ్రెసివ్‌గా ఉంటుందట. డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లో నాని నెక్స్ట్ లెవెల్‌లో చేసిన సినిమా ఇది.

3. అనిరుధ్ మ్యూజిక్

సినిమా అటు ఇటుగా ఉన్నప్పుడు చాలాసార్లు తన మ్యూజిక్‌తో గట్టెక్కించాడు అనిరుధ్. ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం సినిమాను థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని భావించే ఆడియన్స్ చాలా మంది ఉన్నారనడంలో సందేహం లేదు.

4. ఆయా షేర్, ఏష నాగుల పాటలు

ప్యారడైజ్‌కి బోలెడంత హైప్ తీసుకొచ్చిన వాటిలో ఆయా షేర్, ఏష నాగుల వంటి పాటల పాత్ర చాలానే ఉంది. ఈమధ్య మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసిన సినిమాల కోసం థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఆడియన్స్ భావిస్తున్నారు. అది కూడా క్యూరియాసిటీని పెంచే అంశం.

5. మోహన్ బాబు

ఈ మధ్య కాలంలో మోహన్ బాబు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. పాత్ర ఎంతో నచ్చితేనే కానీ ఆయన ఓకే చేయడం లేదు. షికంజ మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. ఆయన లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది.

6. నాని, మోహన్ బాబు కాంబినేషన్ సీన్స్

ప్యారడైజ్ గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న హైలైట్ పాయింట్స్‌లో నాని, మోహన్ బాబు కాంబినేషన్ సీన్స్ కూడా ఒకటని చెప్పాలి. ఆ సన్నివేశాలు వచ్చిన ప్రతిసారి ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ రావడం ఖాయం అంటున్నారు.

7. రాఘవ్ జుయల్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరి మనసులు దోచేశాడు. సినిమాలో ఇతని నటన నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. మేకోవర్ కూడా అందరినీ మెప్పిస్తుందని చెబుతున్నారు.

8. కయాడు లోహర్ బోల్డ్ అవతార్

ఇప్పటివరకు కయాడుకు బబ్లీ ఇమేజ్ ఉంది. కానీ ప్యారడైజ్‌లో ఆమె పాత్ర బోల్డ్‌గా ఉంటుందట. స్మోకింగ్ సన్నివేశాల్లో కూడా ఈమె నటించినట్టు పోస్టర్లు వదిలారు.

9. మదర్ సెంటిమెంట్

సినిమాలో టిపికల్ మదర్ సెంటిమెంట్ ఉంటుందట. చాలా మందికి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ ఉంటాయంటున్నారు.

10. ప్రొడక్షన్ వాల్యూస్

ప్యారడైజ్ కోసం హీరో నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టేశారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. చాలా రకాల సెట్స్ వేశారట. 1980ల బ్యాక్‌డ్రాప్ తీసుకురావడానికి బాగా ఖర్చు అయ్యిందట. ప్రతి ఫ్రేమ్‌లో ఆ ఖర్చు కనబడుతుందని, సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటుందని అంటున్నారు.

‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus