ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

  • October 27, 2023 / 12:45 PM IST

ఒకప్పటి కాలంలో మనల్ని అలరించిన హీరోయిన్స్ అందరూ మనకు గుర్తుండే ఉంటారు. వారిలో కొంత మంది ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల కొంచెం హెల్తీగా అయ్యారు. ఆ హీరోయిన్లలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. రాధ

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు రాధ. మెగాస్టార్ చిరంజీవి, రాధ జోడి తెలుగులో హిట్ కాంబినేషన్స్ లో ఒకటి. రాధ కూతుర్లు కార్తిక అలాగే తులసి కూడా సినిమాల్లో నటిస్తున్నారు.

2. ఖుష్బూ

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు ఖుష్బూ. కొంతకాలం క్రితం విడుదలైన అజ్ఞాతవాసి సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు ఖుష్బూ.

3. రక్షిత

ఇడియట్, పెళ్ళాం ఊరెళితే, నిజం, ఆంధ్రావాలా, శివమణి ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు రక్షిత. ప్రస్తుతం రక్షిత తన తమ్ముడు హీరోగా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే రాజకీయాల్లో కూడా ఉన్నారు.

4. రంభ

ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు రంభ. రంభ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటించారు.

5. రాశి

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టి తరువాత ఎన్నో సినిమాల్లో నటించారు రాశి. కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన కల్యాణ వైభోగమే సినిమాలో హీరోయిన్ మాళవిక నాయర్ కి తల్లిగా నటించారు. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే జానకి కలగనలేదు అనే సీరియల్ లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

6. మీనా

మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన దృశ్యం 2 సినిమాలో కూడా నటించారు మీనా. ఇదే సినిమా తెలుగు రీమేక్ అయిన దృశ్యం 2 లో కూడా మళ్లీ కనిపించబోతున్నారు.

7. రవళి

రవళి కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం నవదీప్ హీరోగా విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి సినిమాలో కూడా హీరోకి వదినగా నటించారు రవళి.

8. నగ్మా

నగ్మా కూడా తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో, అలాగే తమిళ్ లో కూడా నటించారు. నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు.

9. రాధిక

తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు రాధిక. కేవలం తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా హిందీలో కూడా నటించారు. అలాగే ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కూడా నటించారు. నానుమ్ రౌడీ దాన్, ప్రేమ కథ, తేరి, రాజా ది గ్రేట్, సింగం 3 ఇలా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడంతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా అంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ కూడా చేశారు రాధిక.

10. పూనమ్ బాజ్వా

నవదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు పూనమ్ బాజ్వా. తర్వాత బాస్ సినిమాలో నటించారు. అంతే కాకుండా కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు.

11. పూర్ణిమ

ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు పూర్ణిమ. నితిన్ హీరోగా 2017 లో విడుదలైన లై సినిమాలో కూడా నితిన్ కి తల్లిగా నటించారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus