ఘట్టమనేని వారసుడు, టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ లో రికార్డులను తిరగ రాస్తున్నారు. తన కలక్షన్ రికార్డ్ లను తానే బీట్ చేస్తూ నంబర్ వన్ సింహాసనం ఫై ధీమా గా కూర్చొని ఉన్నారు.
రాజకుమారుడు
రాజకుమారుడు (1999) చిత్రంలో రాజాగా కనిపించి అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారారు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ విజయాన్ని సాధించింది. తొలి సినిమా తోనే కమర్షియల్ హీరో అనిపించుకున్నారు.
మురారి
ఫ్యామిలీ మొత్తాన్ని మహేష్ తన అభిమానులుగా చేసుకున్న చిత్రం మురారి. 2001 లో వచ్చిన మూవీలో మహేష్ అన్ని రకాల షేడ్స్ ని చూపించారు. సెంటిమెంట్ సీన్ లలో చక్కగా నటించి .. రాబోయే కాలంలో తనదే నంబర్ వన్ స్థానం అని సూచించారు.
ఒక్కడు
2003లో రిలీజ్ అయిన ఒక్కడుతో కలక్షన్ల వర్షం కురిపించారు. కబడ్డీ ప్లేయర్ గా, లవర్ ని సొంతం చేసుకునే యువకుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 23 కోట్లు రాబట్టింది. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డ్ లు చెరిగిపోయాయి. ప్రిన్స్ తొలి సారి నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు.
అతడు
2005లో అతడు తో దిమ్మ దిరేగేలా చేశాడు. నంద గోపాల్, పార్ధు గా మహేష్ నటనను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేక పోయారు. పక్కా ప్రొఫిషనల్ కిల్లర్ గా రికార్డులన్నింటినీ మర్డర్ చేశారు.
పోకిరి
అండర్ కవర్ పోలీస్ గా మహేష్ చేసిన యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పోకిరి సినిమా తో తెలుగు సినిమాలు 50 కోట్ల మార్క్ ను దాటగలదని చూపించారు. అనధికారంగా 70 కోట్లు వసూల్ చేసిందని టాక్. తెలుగు సినిమా ఇన్ని కోట్లు రాబట్ట గలదా? అని సినీ పండితులు ఆశ్చర్య పోయారు.
ఖలేజా
మాటల మాంత్రికుడితో మహేష్ చేసిన మరో సినిమా ఖలేజ. అతడులో మహేష్ ని సీరియస్ గా చూపించిన త్రివిక్రమ్ .. ఈ సినిమాలో అతడితో కామెడీ చేయించారు. మహేష్ కామెడీ టైం ఇందులో అదిరిపోతుంది. ప్రతి మాట పంచ్ లాగే ఉంటుంది. మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
దూకుడు
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. తండ్రికి మంచి కొడుకిగా.. ఆయన కోసం ఒక రాజకీయ నాయకుడుగా, మరో వైపు ప్రియుడిగా ఒకే సినిమాలో నాలుగు షేడ్స్ ని అద్భుతంగా పలికించారు. దీంతో దూకుడు దూసుకు పోయింది. ఈ చిత్రం తో భారీ వసూళ్లు రాబట్టి నంబర్ వన్ కుర్చీలో మహేష్ ధీమాగా సెటిల్ అయిపోయారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
తెలుగు సూపర్ స్టార్ అయి ఉండి ఎటువంటి భేషజాలకు పోకుండా వెంకటేష్ తో కలిసి స్క్రీన్ ని పంచుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) చిత్రంలో చిన్నోడుగా సింపుల్ గా కనిపించి 50 కోట్లను దాటించేసారు.
శ్రీమంతుడు
ఊరిని దత్తత తీసుకునే మంచి కాన్సెప్ట్ తో వచ్చిన “శ్రీమంతుడు” సినిమా మహేష్ అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రం ఏకంగా రూ. 145 కోట్లు వసూలు చేసింది. మహేష్ “శ్రీమంతుడు”తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చూపించారు.
బ్రహ్మోత్సవం
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో భారీ తారాగణం తో రూపుదిద్దుకున్న బ్రహ్మోత్సవం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12.71 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 18.8 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది.
స్పైడర్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కలయికలో రూపుదిద్దుకున్న స్పైడర్ మూవీని ఓవర్సీస్ లో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ సృష్టించింది. అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా స్పైడర్ ఎనిమిది లక్షల డాలర్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి.
భరత్ అను నేను
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి చేసిన భరత్ అను నేను మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 150 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డుల రారాజు మహేష్ బాబు అని మరోసారి నిరూపించింది.
మహర్షి
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ వంటి బడా నిర్మాతలు నిర్మించారు. మహేష్ 25 వ సినిమాగా వచ్చిన ‘మహర్షి’ 170 కోట్ల గ్రాస్ ను రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక తన 26 వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎలెమెంట్స్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మరి గోల్డెన్ జూబ్లీకి మొదటి చిత్రం కాబట్టి.. ఈ చిత్రం తో 200 కోట్ల గ్రాస్ ను రాబట్టి మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.