అప్పటి వరకు వరుస సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న నిఖిల్.. ‘స్వామి రారా’ సినిమాతో పంధా మార్చి కంటెంట్ ఉన్న కథలు ఓకే చేయడం మొదలు పెట్టాడు. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమా ‘కార్తికేయ'(Karthikeya). స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో చందూ మొండేటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ పై వెంకట శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
రావు రమేష్, తనికెళ్ళ భరణి, జయప్రకాష్,తులసి,సత్య, రాజా రవీంద్ర,ఛత్రపతి శేఖర్.. వంటి సీనియర్లంతా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ‘స్నేక్ హిప్నటైజేషన్’ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు. అది ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ఇచ్చింది. శేఖర్ చంద్ర మ్యూజిక్లో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ అనే పాట కూడా చార్ట్ బస్టర్ అయ్యింది. 2014 అక్టోబర్ 24 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ అక్టోబర్ 24తో ‘కార్తికేయ’ రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఒకసారి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 2.52 cr |
| సీడెడ్ | 0.85 cr |
| ఉత్తరాంధ్ర | 0.88 cr |
| ఈస్ట్ | 0.40 cr |
| వెస్ట్ | 0.25 cr |
| గుంటూరు | 0.50 cr |
| కృష్ణా | 0.35 cr |
| నెల్లూరు | 0.12 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.87 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.27 cr |
| ఓవర్సీస్ | 0.65 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 6.79 cr |
‘కార్తికేయ’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే తర్వాత హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద.. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.6.79 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి ఈ సినిమా రూ.1.79 కోట్ల ప్రాఫిట్స్ అందించి డీసెంట్ హిట్ అనిపించుకుంది.