Bigg Boss 5 Telugu: 12వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లేనా..!

  • November 22, 2021 / 01:23 PM IST

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ అనేది మాములుగా లేదు. దీనికి సంబంధించిన రెండు ప్రోమోలని రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఫస్ట్ ప్రోమో మనం చూసినట్లయితే. ఇద్దరు సభ్యుల దిష్టిబొమ్మలపై రెండు కుండలు పెట్టి వాటిని బద్దలు కొడతూ నామినేషన్స్ చేయాలి. కాజల్ ని ప్రశ్న రాసినందుకు రవి నామినేట్ చేస్తున్నాడు. అలాగే పింకీ సిరిని నామినేట్ చేసింది. వీళ్లిద్దరికూ కూడా ఆర్గ్యూమెంట్ అనేది పీక్స్ లో ఉందని తెలుస్తోంది. అంతేకాదు, నామినేషన్స్ లో మొత్తం ఈవారం కెప్టెన్ మానస్ తప్ప అందరూ నామినేట్ అయినట్లుగా సమాచారం. పింకీ కేవలం ఒకే ఒక ఓటుతో నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూస్తే శ్రీరామ్ చంద్ర కాజల్ ని ఇంకా సన్నీని నామినేట్ చేస్తున్నాడు. కాజల్ ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి మాట్లాడాడు. ఒకర్ని సేవ్ చేద్దామని అందరూ ఆడారు..కానీ నువ్వు ఇద్దర్నీ బర్న్ చేశావ్ అన్నాడు. డిస్ ట్రాయ్ చేయాలన్న ఇంటెన్షన్ తోటే ఆడావ్ అది నాకు నచ్చలేదు అంటూ మాట్లాడాడు. నా ఇంటెన్షన్ నా క్లారిటీ నా డెసీషన్ లో సన్నీకి ఇద్దామని క్లియర్ గా ఉంది అందుకే నేను అలా చేశాను అంటూ చెప్పింది కాజల్. ఇద్దరూ కాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు. అయితే, సన్నీ వెళ్లిపోతాడని నీ భయమా అంటూ కౌంటర్ వేశాడు శ్రీరామ్ చంద్ర. దీనికి కాజల్ అనీమాస్టర్ వెళ్లిపోతుందని నీకు తెలుసా అంటూ శ్రీరామ్ ని తిరిగి క్వశ్చన్ చేసింది. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు.

ఇక్కడే అందుకే తను డిసర్వ్ అని నాకు అనిపించిందంటూ శ్రీరామ్ మాట్లాడాడు. ఇక్కడే సన్నీ ఇన్వాల్ అయ్యాడు, ఇది తప్పు డార్లింగ్ అంటూ సన్నీ మాట్లాడుతుంటే, నేను కాజల్ తో మాట్లాడుతున్నా అంటూ శ్రీరామ్ సన్నీ పై కౌంటర్ ఎటాక్ కి దిగాడు. పాస్ నీ దగ్గర ఉంది నువ్వు వీకా..? చెప్పు అంటూ ఎదురు ప్రశ్నించాడు శ్రీరామ్. కాజల్ ఆడిన స్టైల్ నాకు నచ్చలేదు అంటూ కుండబద్దలు కొట్టాడు. కాజల్ ని నామినేట్ చేశాడు. ఇక సన్నీ మాట్లాడుతూ డార్లింగ్ ఇక్కడ అందరికీ తెలుసు.. ఎవరెవరు ఎవరితో క్లోజ్ ఉన్నారు అనేది అందరికీ తెలుసు అంటే నాకు తెలవదు భయ్ అన్నాడు శ్రీరామ్. లాస్ట్ టైమ్ గ్రూప్ అంటే నువ్వేమన్నావ్ అని సన్నీ మాట్లాడుతుంటే., ఇప్పుడు చెప్తున్నా నేను సిరి షణ్ముక్ మానస్ నలుగురం ఒక గ్రూప్ అంటూ ఆవేశంగా మాట్లాడాడు శ్రీరామ్.

ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ఇక్కడే సాలిడ్ డైలాగ్స్ పడ్డాయి నేను ఐదుకోట్ల మంది ప్రజలు ఒక గ్రూప్ భయ్ అని శ్రీరామ్ అనేసరికి , సన్నీ ఆ గ్రూప్ కి లీడర్ ని నేనే.. అంటూ రీకౌంటర్ వేశాడు. ఈ పంచ్ డైలాగ్స్ కి ఇప్పుడు సన్నీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. దా..దా వచ్చి కొట్టూ అంటూ లాస్ట్ పంచ్ వేశాడు సన్నీ. ఇది లాస్ట్ ఇయర్ పులి మేక ఎపిసోడ్ ని తలపించిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అభిజీత్ ఇంకా అఖిల్ ఇద్దరూ గుర్తుకు వచ్చారని అంటున్నారు. ఇక ప్రోమోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా యాప్ట్ గా సరిపోయిందని, లాస్ట్ పంచ్ వేసిన సన్నీ గ్యాంగ్ లీడర్ అంటూ పోస్టర్స్ చేసి మరీ షేర్లు చేస్తున్నారు సన్నీ ఫ్యాన్స్ అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus