నయన తార ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. సౌత్ ఇండియాకి సూపర్ స్టార్ హీరోయిన్. కానీ గతంలో చూసుకుంటే.. నయన్ టీవీ షోలలో గా హోస్ట్ గా చేసేది. ఆమె యాక్టర్ అవుతుంది అని ఊహించిన వాళ్ళే లేరు. అలాంటి ఆమె.. తర్వాత హీరోయిన్ గా మారి ‘చంద్రముఖి’ ‘లక్ష్మి’ ‘గజినీ’ వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుంది.. ఫైనల్ గా సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె ఎదుర్కొన్న విమర్శలు కూడా అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి.
ముఖ్యంగా ఈమె పర్సనల్ లైఫ్ వ్యవహారాల కారణంగా ఓ దశలో ఈమె కెరీర్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. శింబు, ప్రభుదేవా వంటి వారితో ఎఫైర్లు నడిపిన ఈమె.. వాళ్ళతో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అన్నట్టు తిరిగేసింది. చెన్నై మీడియా అంతా నయన్ ప్రేమ వార్తలతో హల్ చల్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే విగ్నేష్ శివన్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆమె లైఫ్ స్టైల్ ని మార్చేశాడు. ఓవర్ వెయిట్ ఉన్న కారణంగా నయన్ ను పలు సినిమాల నుండీ తప్పించారు.
అలాంటి టైంలో ఆమె స్లిమ్ అయ్యేలా చేసి… కథల ఎంపికని కూడా మార్చేశాడు విగ్నేష్ శివన్. దీంతో మళ్ళీ ఆమె పుంజుకుంది. అయితే ఒకానొక సందర్భంలో ఈమెకి ‘శ్రీరామరాజ్యం'(Sri Rama Rajyam) అనే సినిమాలో సీత పాత్ర పోషించే అవకాశం లభించింది. ఆ సినిమాలో శ్రీరాముడిగా నందమూరి బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. అయితే సీత పాత్రకి గాను నయన్ ని తీసుకున్నందుకు పెద్ద ఎత్తున విమర్శలు కురిశాయి. కొంతమంది నిరసనలు కూడా తెలిపారు.
అయినప్పటికీ దర్శకుడు రమణ, రైటర్ బాపు అస్సలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో వాళ్ళు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ 2011 నవంబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అన్నిటికంటే మించి నయన తార నటనకి మంచి అప్రీషియేషన్ వచ్చింది. ఆమె తప్ప ఈ పాత్రకి ఎవ్వరూ న్యాయం చేయలేరు అనే రేంజ్లో ప్రశంసలు కురిశాయి.
ఆ వరుసలో అవార్డులు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరిలో నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డులను కైవసం చేసుకుంది నయన్. నేటితో శ్రీరామరాజ్యం సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తికావస్తోంది.