2027 సంక్రాంతికి ఇంకా ఆరు నెలలు ఉంది.. ఇప్పటివరకు అయితే ఆరుగురు హీరోలు సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు సమయం వచ్చేసరికి ఎన్ని సినిమాలు బరిలో నిలుస్తాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే ఏడు సినిమాలు లైన్ కట్టి ఉన్నాయి. అందులో ఐదు సినిమాలు టాలీవుడ్ నుండి కాగా, రెండు సినిమాలు ఇతర భాషల సినిమా పరిశ్రమ నుండి అని అంటున్నారు. అయితే ఆ ఇద్దరి విషయంలో స్పష్టత లేదు.
* వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాలు అనేకంటే టాలీవుడ్ నాలుగు మూల స్తంభాల సినిమాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి.
* మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మెగా 158 సినిమా రూపొందుతోంది. ఇటీవల సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను ముగ్గుల పండక్కి తీసుకొస్తామని ఎప్పుడో చెప్పేశారు.
* బాలకృష్ణ లైనప్‌లో ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని సినిమా ఇటీవల మొదలైంది. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్‌లో అంటున్నారు కానీ.. సంక్రాంతి అవ్వొచ్చు అంటున్నారు.
* నాగార్జున్ తన వందో సినిమాను (కింగ్ 100) రా.కార్తిక్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించే ఉద్దేశంలో ఉన్నారట కింగ్.
* వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగానే రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పారు. అన్నట్లు ఈ సినిమాకు ‘జనవరి’ అనే పేరు వచ్చేలా టైటిల్ పెడతారట.
* మరోవైపు సంక్రాంతి స్టార్ శర్వానంద్ కూడా ఓ సినిమాను తీసుకొస్తాడట. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన చేసే సినిమా ఆ పండక్కే అని ఇప్పటికే చెప్పారు.
* ఈ ఐదు సినిమాలే కాదు.. యశ్, సూర్య సినిమాలు కూడా సంక్రాంతి కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యశ్ ‘టాక్సిక్’ని లాగి లాగి పొంగల్‌కి తెస్తారట. అలాగే సూర్య 47వ సినిమా కూడా అప్పుడే అంటున్నారు. కానీ ఇవి డౌటే.