టాక్సీవాలాకి పోటీగా వస్తున్న “24 కిస్సెస్”

  • October 24, 2018 / 01:08 PM IST

టాలీవుడ్ లో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. అతను చేసిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు ఆశించిన దానికన్నా ఎన్నో రెట్లు విజయాన్ని సాధించాయి. దీంతో ప్రస్తుతం క్రేజీ హీరోల జాబితాలో ముందువరుసలో ఉన్నారు. అతని సినిమా రిలీజ్ అవుతుందంటే మాత్రం స్టార్ హీరోలు సైతం పక్కకు తప్పుకుంటున్నారు. కలెక్షన్లు తగ్గిపోతాయని వారం ముందుగానో.. తర్వాతో రిలీజ్ చేస్తున్నారు. అటువంటి హీరోకి పోటీగా హీరోయిన్ వస్తోంది. కుమారి 21 ఎఫ్ లో కుమారిగా బోల్డ్ గా నటించి, మెప్పించిన హెబ్బా పటేల్.. విజయ్ దేవరకొండకి సవాలు విసురుతోంది. అయోధ్య కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “24 కిస్సెస్” లో హెబ్బా హీరోయిన్ గా నటించింది. ఆమె ముద్దు పోస్టర్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ శుక్రవారం విడుదల కావలిసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల నవంబర్ 15 కు వాయిదా వేశారు. అంటే విజయ్ దేవరకొండ తాజా చిత్రం “టాక్సీవాలా” విడుదల తేదీకి కరెక్ట్ గా ఒకరోజు ముందు అన్నమాట. “24 కిస్సెస్”దర్శకనిర్మాతల ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్ దేవరకొండ గత చిత్రం నోటా ఫెయిల్ కావడంతో “టాక్సీవాలా”పై ఆశలు పెట్టుకున్నారు. మళ్ళీ హిట్ ట్రాక్ రావాలని కోరుకుంటున్నారు. “24 కిస్సెస్” యువతని ఆకర్షిస్తే మాత్రం “టాక్సీవాలా” యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus