March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

మార్చి నెల వచ్చేసింది.. మామూలుగా అయితే ఈ నెలలో తెలుగు సినిమాకే కాదు, ఇండియన్‌ సినిమాకు కూడా ఆఫ్‌ సీజన్‌. ఈ నెలలో సినిమాలు వస్తే పెద్దగా ఆదరణ ఉండదు అని అంటారు. పరీక్షలు, ప్రిపరేషన్‌ లాంటి వాటిని కారణాలుగా చెబుతారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ నెలలో కూడా పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే ఈసారి కేవలం టాలీవుడ్‌ కాదు. మొత్తం ఇండియన్‌ సినిమాకు ఈ నెల కీలకంగా మారింది. ఎందుకో చూద్దామా?

March Movies

మార్చి తొలి రెండు వారాలు సినిమాలు ఉన్నా సైలెంట్‌గా ఉండేవే. ఎందుకంటే చిన్న సినిమాలు. అయితే వీటిలో ఏదైనా పెద్ద సౌండ్‌ చేస్తే చెప్పలేం. మార్చిలో అసలైన బాక్సాఫీస్ వార్ మూడో వారం నుండి మొదలవుతుంది. రణ్‌వీర్‌ సింగ్‌ – ఆదిత్య ధర్‌ సినిమా ‘ధురంధర్‌ 2’ మార్చి 19న రాబోతోంది. అదే రోజున యశ్‌ – గీతూ మోహన్‌ దాస్‌ సినిమా ‘టాక్సిక్‌’ని కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఆ హీరోల రీసెంట్‌ ఫామ్‌ చూస్తే ఇండియన్‌ సినిమా ఆ వారం ఫుల్‌ ప్యాక్డ్‌గా ఉండబోతోంది అని చెప్పొచ్చు. ‘ధురంధర్‌ 1’ విజయం ఇప్పుడు ‘ధురంధర్‌ 2’కి మంచి బూస్ట్‌ ఇస్తోంది. ప్రచార చిత్రాలు టాక్సిక్‌కి కలసి వస్తున్నాయి.

ఇక ఆఖరి వారంలో పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాను తీసుకురాబోతున్నారు. ‘ఓజీ’ సినిమా తర్వాత వస్తుండటం, ఇప్పట్లో పవన్‌ నుండి మరో సినిమా రాని పరిస్థితి ఉండటం లాంటి కారణాల వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకనిర్మాతలు కూడా ఆ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ‘టాక్సిక్‌’, ‘ధురంధర్‌ 2’ సినిమాల్లో ఈ సినిమాకు పాన్‌ ఇండియా అప్పీల్‌ లేకపోయినా టాలీవుడ్‌కి ఫుల్‌ ఫీస్ట్‌ అయితే ఈ సినిమా ఇవ్వాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఆ లెక్కన ‘మార్చి’ ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.

కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus