ఈవారం విడుదలవుతున్న మూడు సినిమాలూ విభిన్నమైనవే

  • July 16, 2019 / 11:39 AM IST

శుక్రవారం అనగానే నాలుగైదు సినిమాలు రిలీజవ్వడం.. ఒకటి హిట్టవ్వడం, ఒకటి ఫట్టవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఈ శుక్రవారం కూడా మూడు సినిమాలు వార్ కి రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి మాత్రమే స్ట్రయిట్ సినిమా.. మిగతా రెండు డబ్బింగ్ సినిమాలే. కానీ.. మూడు వైవిధ్యమైన సినిమాలు. రామ్ నటించగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” ఈవారం రిలీజుల్లో పెద్ద చిత్రం. ఆల్రెడీ మంచి బిజినెస్ జరిగిన ఈ సినిమా కోసం బి,సి సెంటర్ ఆడియన్స్ వరకూ బాగానే వెయిట్ చేస్తున్నారు. ఇక రెండోది విక్రమ్ నటించిన “మిస్టర్ కెకె”. ఈ తమిళ డబ్బింగ్ సినిమాకి ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో బిజినెస్ జరగలేదు. అందుకు కారణం విక్రమ్ మునుపటి సినిమాల రిజల్ట్స్.

ఇక ముచ్చటైన మూడో సినిమా “ఆమె”. అమలపాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం టీజర్ సృష్టించిన సంచలనం మామూలుది కాదు. ఈ సినిమాలో అమలపాల్ ఓ 10 నిమిషాల పాటు నగ్నంగా కనిపించనుందనే వార్త పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఈ మూడు సినిమాల మూల కథలు హాలీవుడ్ చిత్రాల నుంచి తీసుకొన్నవే కావడం గమనార్హం. మరి రామ్ వెర్సెస్ విక్రమ్ వెర్సెస్ అమలపాల్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.

2

3

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus