మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? మహేష్ బాబు తెర మీద కనిపిస్తే చాలు అని అభిమానులే కాదు చాలా మంది సినీ లవర్స్ కోరుకుంటారు అనడంలో సందేహం లేదు.
అతని స్వాగ్, స్క్రీన్ ప్రెజన్స్ ని మ్యాచ్ చేస్తూ ఓ మోస్తరుగా సినిమా కంటెంట్ ఉన్నా సరిపోతుంది. బాక్సాఫీస్ బద్దలవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జామ్పుల్ గా ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) సినిమాని చెప్పుకోవచ్చు. సరిగ్గా 4 ఏళ్ళ క్రితం అంటే.. 2022 మే 12న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
‘గీత గోవిందం’ తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకుడు.’పోకిరి’ తర్వాత లుక్స్ పరంగా మహేష్ బాబు ఎనర్జిటిక్‌గా కనిపించిన సినిమా ఇదే. ‘సర్కారు వారి పాట’ ప్రమోషనల్ కంటెంట్లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా మెడ పై టాటూతో మహేష్ కనిపించింది ఈ సినిమాలోనే..! అందుకే రిలీజ్ కి ముందు ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ టైంలో టికెట్ రేట్లు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ కి ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు.
అయితే రిలీజ్ కి కొన్ని గంటల ముందు నుండే ఈ సినిమాపై ట్విట్టర్లో నెగిటివ్ ట్వీట్స్ పడటం నిర్మాతల్ని కంగారు పెట్టింది. యూఎస్ ప్రీమియర్స్ పడకుండానే ‘Disaster SVP'( #DisasterSVP) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దానికి తోడు ఎర్లీ మార్నింగ్ షోలకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ ట్రాక్ తప్పింది అంటూ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాలంతా అభిప్రాయపడ్డాయి.
ఏ సినిమాకి అయినా టాక్ ఇలా ఉంటే.. ఈవెనింగ్ షోలకి జనాలు ఉండరు. కానీ విచిత్రంగా ‘సర్కారు వారి పాట’ సినిమాకి ఈవెనింగ్ షోలు ఫ్యామిలీ ఆడియన్స్ తో ప్యాక్ అయ్యాయి. దీంతో తొలిరోజు దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి రీజనల్ మూవీగా ఆల్ టైం రికార్డులు సృష్టించింది ‘సర్కారు వారి పాట’.అదే జోష్ వీకెండ్ వరకు కొనసాగింది. దీంతో 80 శాతం రికవరీ తొలి వీకెండ్ కే సాధ్యమైంది.అటు తర్వాత కర్నూల్ లో ఓ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం.
అందులో భాగంగా మహేష్ బాబు.. ఎవ్వరూ ఊహించని విధంగా స్టేజిపైకి వెళ్లి డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో బైట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం.. వీక్ డేస్ లో కూడా ఓపెనింగ్స్ స్టడీగా నమోదవ్వడానికి కారణం అయ్యింది. హీరో లేదా హీరోయిన్ ముందుండి సినిమాని ప్రమోట్ చేస్తే.. ఔట్పుట్ ఏ రేంజ్లో వస్తుందో చెప్పడానికి దీనిని ఒక ఎగ్జామ్పుల్ గా చెప్పొచ్చు.అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా రావడం వల్ల ‘సర్కారు వారి పాట’ వసూళ్లు 2 వారాలకే పరిమితమయ్యాయి.
లేదంటే 3వ వారం కూడా గట్టిగా క్యాష్ చేసుకుని ఉండేది. ఏదేమైనా ‘సర్కారు వారి పాట’ సినిమా ఫుల్ రన్లో రూ.175 కోట్లకు పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసి రూ.105 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసింది. నైజాం, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో భారీ వసూళ్లు సాధించింది.’సర్కారు వారి పాట’ కంటెంట్లో లోపాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగింది అంటే.. అది పూర్తిగా మహేష్ బాబు వన్ మెన్ షో వల్లనే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ సినిమాలో డిజర్ట్ ఫైట్, కళావతి సాంగ్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే లారీ ఫైట్, క్లైమాక్స్ లో వచ్చే ‘మమ మహేషా’ సాంగ్, బ్యాక్ ఫైట్ వంటి వాటికి రిపీట్ వాల్యూ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.