ఇంట్రవెల్ ఫైట్ కోసం 45 రోజులు షెడ్యూల్ వేసిన రాజమౌళి

  • October 30, 2018 / 07:16 AM IST

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చిత్రాల్లో విశ్రాంతికి ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. సినిమా కథని మలుపు తిప్పేదిగా… మాస్ ప్రేక్షకులకు పూర్తి విందును ఇచ్చేదిగా ఉంటాయి. అలాంటి యాక్షన్ సీన్ #RRR లోను ఉంటుందని తెలిసింది. బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి తొలిసారి నటిస్తున్న ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 5వ తేదీన ప్రారంభించడానికి అంతా సిద్ధం చేశారు. మొదట షెడ్యూల్ యాక్షన్ సీన్ తోనే మొదలుకానున్నట్టు తెలిసింది.

ఇందుకోసం 45 రోజుల పాటు కేటాయించినట్లు సమాచారం. ఇది విశ్రాంతికి ముందు వచ్చే సన్నివేశమని, దీనిని రామ్ లక్ష్మణ్ లు విభిన్నంగా కంపోజ్ చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అంతేకాదు ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నట్లు పేర్కొన్నారు. పేర్లు బయటికి రాలేదు కానీ.. ఆ ముగ్గురిలో ఒక ఫారిన్ బ్యూటీ ఉంటుందని వివరించారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ విశేషాలను అధికారికంగా రాజమౌళి ప్రకటిస్తే తెలుసుకోవాలని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus