బాబోయ్ – ఒక్కరోజులో 8 సినిమాలు!!!

  • February 29, 2016 / 11:13 AM IST

రాబోయే వారం సినిమా వాళ్ళకు పండగ అనే చెప్పాలి ఎందుకంటే, వచ్చే నెలలో భానుడి ప్రతాపంతో పాటు, పరీక్షలు కూడా ఉండడంతో అందరూ బిజీ అయిపోతారు. సినిమాల జోలికి పెద్దగా వెళ్ళరు. ఎందుకంటే మన నిర్మాతలు తెలివిగా ఆలోచించి పెద్ద సమయం లేకపోవడం వల్ల వీలైనంత త్వరగా సినిమాని విడుదల చేసేందుకు రెడీ అయిపోతున్నారు. అందులో భాగంగానే ఒకే రోజు 8 సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. రానున్న శుక్రవారం 26న విడుదలయ్యే 8 సినిమాల్లో 6 సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలు కాగా, మరో రెండు డబ్బింగ్ సినిమాలు…వాటి వివరాలు ఇవే…

డైరెక్ట్ సినిమాలు:
పీవీపీ బ్యానర్ నుంచి వస్తున్న థ్రిల్లర్ మూవీ ‘క్షణం’
అక్కినేని నాగార్జున బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తో వస్తున్న లవ్ స్టోరీ ‘పడేశావే’
శ్రీకాంత్ మూవీ ‘టెర్రర్’
వెన్నెల కిషోర్ సినిమా ‘ఎలుకా మజాకా’
హారర్ కామెడీ ‘రాజుగారింట్లో ఏడవ రోజు’
కామెడీ చిత్రంగా ‘వీరి వీరి గుమ్మడి పండు’

డబ్బింగ్ సినిమాలు:
జయం రవి కోలీవుడ్ జాంబీ మూవీ ‘మిరుదన్’.. తెలుగులో ‘యమపాశం’ గా విడుదల అవుతుంది
హాలీవుడ్ మూవీ ‘గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’ …డబ్బింగ్ వర్షన్ తెలుగులో విడుదల అవుతుంది.

ఇలా మొత్తంగా 8 సినిమాలు వచ్చే వారాంతరంలో విడుదల అవుతున్నాయి. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీకెండ్ కి తెలిసిపోతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus