తమిళనాట అసాధారణ విజయం సొంతం చేసుకోవడమే కాక ప్రేక్షకుల మనసు దోచుకున్న “96” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ఈ సినిమా లో హీరో కోసం వెతుకుతున్నాడు. తొలుత ఈ చిత్రంలో కథానాయకుడిగా నానీని అనుకున్నప్పటికీ.. నాని డేట్స్ ఎడ్జెస్ట్ అవ్వాలంటే కనీసం రెండేళ్లు టైమ్ పడుతుంది.
అప్పటివరకూ కథను అట్టే పెడితే ఓల్డ్ అయిపోయే అవకాశం ఉంది. మరో పక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా లో నటించేందుకు ఇష్టపడుతున్నాడు. కానీ ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే దిల్ రాజు కి మాత్రం ఈ సినిమాలో గోపీచంద్ ని హీరోగా పెడితే బాగుంటుందని అని భావిస్తున్నాడు. ఒకవేళ దిల్ రాజు గాని గోపీచంద్ ని అడిగితే గోపీచంద్ ఈ సినిమా చేసే అవకాశం ఉంది. గోపీచంద్ ఒప్పుకోకపోతే మళ్ళి హీరో కోసం వేట కొనసాగిస్తాడు దిల్ రాజు. ఎందుకంటే తమిళ్ లో విజయ్ సేతుపతి పాత్ర చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి హీరోనే మళ్ళి తెలుగుకి చూస్తున్నాడు దిల్ రాజు.