‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళిచూపులు’ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన సినిమా అంటే ‘అర్జున్ రెడ్డి'(Arjun Reddy) అనే చెప్పాలి. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకి తొలి సినిమా ఇది. ఈ కథని పట్టుకొని చాలా మంది హీరోలను అప్రోచ్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా..! కానీ ఎవ్వరూ ఈ కథ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఆ సినిమాని ‘భద్రకాళి పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.
షాలిని పాండే కూడా ఈ సినియంతో హీరోయిన్ గా డెబ్యు ఇవ్వడం జరిగింది. 2017 ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. టాలీవుడ్లో ఇదొక గేమ్ ఛేంజర్ మూవీ అని చెప్పాలి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో అర్జీవీలా అవతరించాడు. నేటితో ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తికావస్తోన్న నేపధ్యంలో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 7.61 cr |
| సీడెడ్ | 1.82 cr |
| ఉత్తరాంధ్ర | 1.17 cr |
| ఈస్ట్ | 0.77 cr |
| వెస్ట్ | 0.50 cr |
| గుంటూరు | 0.94 cr |
| కృష్ణా | 0.94 cr |
| నెల్లూరు | 0.35 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.10 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 7.25 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 21.35 cr |
‘అర్జున్ రెడ్డి’ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కేవలం రూ.5 కోట్లు. 2 రోజులకే ఆ టార్గెట్ ను రీచ్ అయిన ఈ సినిమా ఫుల్ రన్లో ఏకంగా రూ.21.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.16 కోట్ల భారీ లాభాలు మిగిల్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.