50 కోట్ల క్లబ్ లో “అ..ఆ”

  • June 9, 2016 / 10:08 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా ఫోన్ నుంచి వచ్చిన తాజా చిత్రం “అ.. ఆ” బాక్స్ ఆఫీస్ రికార్డ్ లను తిరగరాస్తోంది. నితిన్, సమంత జంటగా నటించిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. జూన్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన “అ.. ఆ” చిత్రం.. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.5  కోట్లు వసూలు చేసి రికార్డ్ లకు తెర లేపింది.

నాలుగు రోజులకే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టింది. మొత్తంగా రూ.38 కోట్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు చానెల్ పోటీ పడి రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాలకు వచ్చే మొత్తంలో శాటిలైట్ హక్కులకు డబ్బులు రావడం త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ని చాటింది. ఈ చిత్రం విడుదలై వారం రోజులైంది. ఈ ఏడు రోజుల  కలక్షన్స్ రూ.50 కోట్లకు చేరింది.

ఒక కర్ణాటకలోనే ఈ చిత్రం రూ.2 కోట్లు వసూల్ చేసి రికార్డ్ లు బద్దలు కొట్టింది. దీంతో చిత్ర బృందం సంతోషంతో పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. టాక్ బాగా రావడంతో వీకెండ్ టికెట్లు ఇప్పుడే బుక్ అయిపోయినట్లు అక్కడి సినీ వర్గాలు చెప్పాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus