‘అత్తారింటికి దారేది’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి పెద్ద సినిమాల తర్వాత ఓ చిన్న సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘అఆ'(A AA) అనే సినిమా చేశాడు మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.
నితిన్ ఈ సినిమాలో హీరో. సమంత హీరోయిన్ కాగా.. అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాని ‘హారిక అండ్ హాసిని క్రియెషన్స్’ సంస్థపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.
2016 వ సంవత్సరం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘హార్ట్ ఎటాక్’ ‘చిన్నదాన నీకోసం’ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ వంటి ఫ్లాపులతో డౌన్ ఫాల్లో ఉన్న నితిన్ కి .. మంచి కంబ్యాక్ మూవీ అయ్యింది ‘అ ఆ’. నితిన్, సమంత..ల పెయిర్ రావు రమేష్, సీనియర్ నరేష్, ప్రవీణ్, హరితేజ,అజయ్, పోసాని కృష్ణమురళి, పమ్మి సాయి..ల కామిడీ ఈ సినిమాకి హైలెట్ అయ్యింది అని చెప్పాలి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపధ్యంలో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 13.19 cr |
| సీడెడ్ | 4.18 cr |
| ఉత్తరాంధ్ర | 4.22 cr |
| ఈస్ట్ | 2.39 cr |
| వెస్ట్ | 1.98 cr |
| గుంటూరు | 2.50 cr |
| కృష్ణా | 2.20 cr |
| నెల్లూరు | 0.98 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 31.64 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.15 cr |
| ఓవర్సీస్ | 10.65 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 47.44 cr |
‘అఆ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.27.71 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.47.44 కోట్ల షేర్ ను రాబట్టి…. బయ్యర్లకు రూ.19.73 కోట్ల లాభాలు మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.