Prabhas: ప్రభాస్ వల్ల బ్రతికిన ఫ్యాన్.. ఏకంగా 20 రోజులు..?

  • April 16, 2021 / 08:29 PM IST

సినిమా రంగంలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అభిమానుల వల్లే ఎంతోమంది హీరోలు స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నారు. కొంతమంది హీరోలు పలు సందర్భాల్లో అభిమానులపై చికాకు పడినా కొంతమంది హీరోలు మాత్రం అభిమానుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అభిమానులు కష్టాల్లో ఉంటే చలించి సాయం చేసిన హీరోలు కూడా కొంతమంది ఉన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ తన అభిమాని ఒకరు కొన్ని గంటల్లో చనిపోతారని తెలిసి షూటింగ్ ను ఆపేసి అభిమానిని కలిశారు. కొన్నేళ్ల క్రితం ఈ ఘటన జరగగా తాజాగా వ్యాపారవేత్త వెంప కాశీ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వెంప కాశీ తన కజిన్ కొడుకు ఒకరోజు కళ్లు తిరిగి పడిపోయాడని వైద్యులు అతను క్యాన్సర్ తో బాధ పడుతున్నాడని 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పారని తెలిపారు.

తన కజిన్ కొడుకు చివరి కోరికగా ప్రభాస్ షూటింగ్ కు తీసుకెళ్లాలని కోరాడని ఆ సమయంలో మొదట ప్రభాస్ ను కలిసేందుకు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని వెంప కాశీ తెలిపారు. డాక్టర్లు బాబు 2 గంటల్లో చనిపోతాడని చెప్పగా ప్రభాస్ కు ఫోన్ ద్వారా విషయం తెలియజేశామని ప్రభాస్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మేకప్ తో వచ్చేశాడని వెంప కాశీ అన్నారు. ఆ తరువాత బాబుతో ప్రభాస్ గంటకు పైగా మాట్లాడాడని వెంప కాశీ తెలిపారు.

ప్రభాస్ క్యాన్సర్ పేషెంట్ అయిన అభిమానిని ముద్దు పెట్టుకున్నాడని.. ప్రభాస్ ను చూసిన ఆనందంలో 2 గంటల్లో చనిపోతాడనుకున్న బాబు 20 రోజులు బ్రతికాడని వెంప కాశీ అన్నారు. బాబుని కలిసిన తరువాత రోజు బాబు ఆరోగ్యం గురించి ప్రభాస్ ఫోన్ లో తెలుసుకున్నాడని వెంప కాశీ తెలిపారు.


‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus