పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలోపున సాధ్యమైనన్ని చిత్రాలు పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగుతుండడం, పవన్ కూడా ఎంఎల్ఏ గా పోటీ చేయడం ఫిక్స్ కావడంతో అప్పటికే నాగుగైదు చిత్రాలను కంప్లీట్ చేయాలనీ పక్కాగా ప్రణాళిక రచించుకుంటున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్, దీని తర్వాత చేయనున్న రెండు ప్రాజక్టులకు పచ్చ జెండా ఊపారు. కాటమరాయుడు చిత్రాన్ని ఫిబ్రవరికి పూర్తిచేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారు.
ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతుండగానే తమిళ దర్శకుడు ఆర్ టీ నేసన్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించనున్నారు. వీటికి రెగ్యులర్ షూటింగ్ డేట్స్ కూడా పవన్ కేటాయించేశారు. తాజాగా తమిళ డైరక్టర్ శివ చెప్పిన పవర్ ఫుల్ కథకు ఒకే చెప్పినట్లు తెలిసింది. శివ గతంలో వీరమ్, వేదలమ్ తీశారు. ప్రస్తుతం అజిత్ తోనే “తల 57” అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ డైరక్టర్ వినిపించిన స్టోరీ సూపర్ గా ఉండడంతో పవన్ వెంటనే ఒకే చెప్పినట్లు తెలిసింది. ఈ చిత్రం గురించి మరిన్ని సంగతులు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.