రాజమౌళి వెండితెరపై సృష్టించిన బాహుబలి కంక్లూజన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజు దేశవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అమెరికాలో 8 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ మార్క్ ని చేరిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రలోకి ఎక్కింది. ఇంకా శనివారం, ఆదివారాల్లో మరింత కలక్షన్స్ రాబట్టింది. మూడు రోజుల్లో 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వేగంగా ఈ మార్క్ ని దాటినా మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది.
కేవలం హిందీ వెర్షన్ మూడు రోజుల్లో 128 కోట్లు రాబట్టింది. సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ పేరిట ఉన్న మొదటి వీక్ కలక్షన్స్ రికార్డ్ (180 కోట్లు)ను బద్దలు కొట్టే దిశగా బాహుబలి 2 (హిందీ వెర్షన్) దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోను మూడు రోజుల్లో 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా వసూలు చేసి తెలుగు సినిమా సత్తాని చాటుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.