మహానటి సావిత్రి గారి తరువాత ఆ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్న నటి సౌందర్య. ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయి అంటే ప్రేక్షుకులు అస్సలు ఒప్పుకోరు. అంతలా తెలుగు ప్రేక్షకులు ఈమెను ఓన్ చేసుకున్నారు. కెరీర్ ప్రారంభం నుండీ గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ వచ్చింది సౌందర్య. ఆమెకు ఎంత స్టార్ డం వచ్చినా.. చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి నామోషీగా ఫీలయ్యేది కాదు.
అందుకే ఈమెకు దర్శక నిర్మాతలు కూడా అంత మర్యాద ఇచ్చేవారు. అయితే 2004 లో ఈమె హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పటికీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే దీనికి సౌందర్య చేసిన చిన్న తప్పే కారణమని సీనియర్ దర్శకుడు చిట్టిబాబు కామెంట్స్ చేశారు. సౌందర్యను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఇతనే అన్న సంగతి బహుశా చాలా మందికి తెలిసి ఉండదు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. ‘బీజేపీ తరపున ప్రచారం చెయ్యాలని సౌందర్యను నేనే ఒప్పించాను.ఈ క్రమంలో బెంగుళూరు నుండీ హైదరాబాద్కు ప్రచారానికి రావడానికి..
ఆమెకు ఓ జెట్ ఎయిర్వేస్ సౌకర్యాన్ని కూడా కల్పించాను. కానీ, ఆమె సోదరుడు అమర్నాథ్.. తన స్నేహితుడి హెలికాప్టర్ ఉందని చెప్పి అందులో వెళ్దామని సౌందర్యను ఒప్పించాడు. అందుకు సౌందర్య కూడా ఓకే చెప్పేసింది. కేవలం ఇద్దరికి మాత్రమే సీటింగ్ కెపాసిటీ కలిగిన హెలికాప్టర్ అది. భారం ఎక్కువవడంతో అదుపుతప్పి కింద పడి ధ్వంసమైంది. ఆ రోజు సౌందర్య తన సోదరుడి మాట విని తప్పు చేసింది. నా మాట వినుంటే ఈరోజు ఆమె ప్రాణాలతో మన మధ్య ఉండేది’ అంటూ ఎమోషనల్ అయ్యారు చిట్టిబాబు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!