పంద్రాగస్టుకి అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ఫస్ట్‌ లుక్‌

  • July 30, 2019 / 03:32 PM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చకా చకా జరుగుతోంది. 2020 సంక్రాంతి టార్గెట్ గా ఈ చిత్రం షూటింగ్ పరుగులు తీస్తుంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా పేతురాజ్‌ మరో హీరోయిన్ గా నటిస్తుంది. టబు, నవదీప్, సుశాంత్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య తారాగణం పై ఫ్యామిలీ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఇక తర్వాతి షెడ్యూల్‌ ఆగస్టు మొదటి నుండీ రాజమండ్రిలో మొదలు కానుందని సమాచారం. అలాగే ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారని సమాచారం. గతేడాది తన సినిమా ‘అరవింద సమేత’ టీజర్ ను కూడా ఆగష్టు 15 కే విడుదల చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు బన్నీ తో చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను కూడా అదే డేట్ కు విడుదల చేయబోతున్నాడట. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం బన్నీ తండ్రిగా నటిస్తున్నాడట. ఇక మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్‌ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus