ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

వెంకటేష్ , త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam) సినిమా కోసం వెంకటేష్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 30కి వాయిదా పడింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విడుదల చేసిన 2 పాటలు నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ట్రైలర్ ను రిలీజ్ చేసి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్.

ఆదర్శ కుటుంబం ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 32 సెకన్ల నిడివి కలిగి ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హీరో, భార్య చేసిన అప్పుల వల్ల ఇబ్బంది పడుతుంటాడు. మరోవైపు కొన్ని ఇళ్ళల్లో దొంగతనాలు చేస్తూ.. అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటుంది ఓ గ్యాంగ్. వాళ్ళు అనుకోకుండా హీరో ఫ్యామిలీతో పెట్టుకుంటే.. ఆ క్రిమినల్ గ్యాంగ్ కి హీరో ఎలా బుద్ధి చెప్పాడు అన్నది మిగిలిన కథ.

పూర్తిగా క్రైమ్ కామిడీ అండ్ ఫ్యామిలీ జోనర్లో కనిపిస్తుంది. ‘కవి స్వతంత్రుడు.. ఏమైనా ఆలోచిస్తాడు కానీ ఏమీ చేయడు!’ ‘మా మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఏముంటదన్నా.. అమ్మడానికి ఆస్తులు ఉండవు, కొనడానికి డబ్బులు ఉండవు. లేదని ఒప్పుకోవడానికి మొహమాటం.. ఉందని చెప్పుకోవడానికి పరువు తప్ప ‘ ‘చంపే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఎందుకు సార్ ‘ ‘ఆరు నెలల క్రితం నువ్వు చేసిన తప్పు… ఆరు అడుగుల షేప్ తీసుకుంటే.. అది నేను ‘ వంటి డైలాగ్స్ బాగున్నాయి.

ట్రైలర్ లో చాలా సినిమాల ఛాయలు కనిపించాయి. వెంకటేష్ నారప్ప నుండీ మొన్నామధ్య వచ్చిన బ్లాస్ట్ వరకు చాలా సినిమాల పోలికలు ఉన్నాయి. మరి గురూజీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఎలాంటి మ్యాజిక్ చేసిందో అక్టోబర్ 30న తెలుస్తుంది. ప్రస్తుతానికి ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus