సినిమాల్లో నటించడం అనేది చాలా వీజీ పని అనుకొంటుంటారు కొందరు. కానీ చాలా తక్కువ మందికి తెలిసిందేమిటంటే.. నిజానికి అది రోజు కూలీ కంటే కష్టమైన పని. మనం థియేటర్లో కాలు మీద కాలేసుకొని కూర్చుని చూసే సన్నివేశం కోసం సినిమా యూనిట్ దాదాపు రెండుమూడు రోజులు ఒక్కోసారి వారం రోజులు కూడా కష్టపడుతుంటారు. ఇవన్నీ తెలియని జనాలు సినిమాలో హీరోహీరోయిన్స్ అంటే ఆడుతూపాడుతూ సినిమాలు చేసేస్తారు అనుకొంటుంటారు. ఈ గ్లామర్ ఫీల్డ్ లో సుఖం 20% ఉంటే.. కష్టం 80%. ఇప్పుడు ఈ నీతి మొత్తం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇటీవల ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం ఒక ఫీట్ చేయబోయిన హీరో కామ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆది పినిశెట్టి కాలు విరిగిందట.
వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి కట్టు కట్టించుకొన్నప్పటికీ.. డాక్టర్లు ఒక మూడు వారాలపాటు కాలు కడపకూడదని చెప్పేసారట.
ఆది పినిశెట్టి కాలు విరగడంతో దాదాపు మూడు సినిమాలు ఇప్పుడు ఇబ్బందిలోపడ్డాయి. తాప్సీ కథానాయికగా నటించబోయే ఇంకా ప్రారంభమవ్వని సినిమా షెడ్యూల్స్ మారిపోగా.. “రంగస్థలం” సినిమా కూడా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాగే ఆది నటిస్తున్న ఓ తమిళ చిత్రం కూడా షూటింగ్ ఆగిపోయింది. పాపం ఆది కావాలని చేయకపోయినా అతడికి జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఇన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోవడం బాధాకరమే.