మళ్ళీ ఎన్టీఆర్, చరణ్ లను తిడుతున్న సోషల్ మీడియా జనాలు

  • January 24, 2019 / 08:21 AM IST

ఇదివరకు హీరోల అభిమానులు థియేటర్ల దగ్గర కొట్టుకొనేవారు, ఆ తర్వాత ఆ కొట్లాటలు కలెక్షన్స్ దాకా చేరాయి. కానీ.. ఈ ఇంటర్నెట్ యుగంలో గొడవలు ట్విట్టర్ కి మాత్రమే పరిమితమయ్యాయి. అయితే.. ఈమధ్యకాలంలో కేవలం కలెక్షన్స్ విషయంలో మాత్రమే కొట్టుకోవడం లేదు.. అనవసరమైన ట్రోలింగ్స్, పరాయి హీరోలను, వారి అభిమానులను బూతులు తిట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఏదైనా రీజన్ ఉండి తిట్టినా ఒక అందం కానీ.. ఎలాంటి రీజన్ లేకుండానే తిట్టిపోస్తున్నారు. తాజాగా ఈ ఇంటర్నెట్ ట్రోలింగ్ కి చిక్కారు ఎన్టీఆర్ & చరణ్. ఈ ఇద్దరు హీరోలు ఈమధ్య అఖిల్ నటించిన “మిస్టర్ మజ్ను”కి సపోర్ట్ చేయడమే కాక అఖిల్ తో కలిసిన ఫోటోలను షేర్ చేశారు. ఇదే వీళ్లపై అందరూ మండిపడడానికి కారణమైంది.

ఎన్టీఆర్, చరణ్ లలో ఎవరూ “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమా గురించి కామెంట్ చేయలేదు. కనీసం సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ.. అఖిల్ “మిస్టర్ మజ్ను”ను మాత్రం తెగ ప్రమోట్ చేస్తున్నారు. దాంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ను, జనరల్ ఆడియన్స్ చరణ్ ను ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు. ఓ గొప్ప సినిమా గురించి చెప్పడానికి, ఎంకరేజ్ చేయడానికి టైమ్ ఉండదు కానీ మీలో మీరు మాత్రం మీ సినిమాలను ప్రమోట్ చేసుకొంటారు అని తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఎప్పట్లానే ఎన్టీఆర్, చరణ్ లు ఈ ట్రోలింగ్స్ ను ఏమాత్రం పట్టించుకోలేదనుకోండి. కానీ.. వారి ఫాలోవర్స్ మాత్రం ఆ ట్రోల్స్ ను తిప్పికొట్టడం కోసం తెగ తాపత్రయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus