ఆకాంక్ష అందమైన అమ్మాయి కాదు.. అందమైన ఆంటీ

Advertisement

ఆఫీసర్ వంటి డిజాస్టర్ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున చేసిన సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని కూడా నటిస్తున్నారు. వీరి పక్కన రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే తన హీరోయిన్ గురించి నాగార్జున ఓ కామెంట్ చేశారు. “చాలా కాలం తర్వాత ఒక అందమైన అమ్మాయి నా పక్కన హీరోయిన్ గా నటిస్తోంది” అంటూ సంతోషంతో కామెంట్ చేశారు. ఇంకేముంది అంత అందమైన అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఆరా తీశారు. అనేక విషయాలు బయటపడ్డాయి. ఆకాంక్ష అమ్మాయి కాదు.. ఆంటీ. పెళ్లి అయింది. ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నారు. అంతే కాదు ఆకాంక్ష ఇదివరకూ అక్కినేని కాంపౌండ్ లో సుమంత్ సరసన “మళ్లీ రావా” చిత్రంలో నటించింది.

అందులో నటనకు మెచ్చుకొని దేవదాస్ లో పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు. రీసెంట్ గా ఇదే విషయాన్ని ఆమె ముందు ఉంచగా ఆమె ఆవేశపడ్డారు. “పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి?. పెళ్లి అయితే అంతేనా? పెళ్లి పెళ్లే.. నటన నటనే.. ట్యాలెంట్ ఉంటే దానికి దీనికి లంకె వేస్తారెండుకు? అయినా పాతకాలం భామ్మ గారి ఆలోచనలేంటి ఇంకా” అంటూ విరుచుకుపడిపోయింది. అలా అన్నప్పుడు ఇంకెవరు ప్రశ్నిస్తారు?.. చాలామందికి స్ఫూర్తినిస్తున్నందుకు అభినందిస్తారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 27న రిలీజ‌వుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus