తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్న ఆకాంక్ష సింగ్

  • September 21, 2018 / 01:02 PM IST

అక్కినేని మనవడు సుమంత్ ని హిట్ ట్రాక్ లోకి తెచ్చిన మూవీ మళ్ళీ రావా. గౌతమ్‌ తిన్నమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ మంచి నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య ప్రేమ చక్కగా కుదిరింది. అందుకే నాగార్జున తన పక్కన నటించే ఛాన్స్ ఇచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన “దేవదాస్” లో నాగ్ కి జోడీగా నటించారు. సినిమా రిలీజ్ కి ముందే “చాలా కాలం తర్వాత ఒక అందమైన అమ్మాయి నా పక్కన హీరోయిన్ గా నటిస్తోంది” అంటూ సంతోషంతో నాగ్ కామెంట్ చేశారు. ఆ మాటతోనే సినిమా విజయం సాధించినంత ఆనందం పడిపోయిది. అయినా లోపల భయం అలాగే ఉంది.

ఎందుకంటే తనకి పెళ్ళికావడంతో యంగ్ హీరోలు ఎవరూ ఆమెను హీరోయిన్ గా ఒప్పుకోవడానికి ముందుకురావడం లేదు. నాగ్ మాటతోనైనా తనపై ఆంటీ అనే ముద్ర చెరిగిపోతుందని భావిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మిస్తున్న దేవదాస్ ఈనెల 27న రిలీజ‌వుతోంది. హిట్ అయితే తనను సీనియర్ హీరోలకు జోడీగానైనా తీసుకుంటారని ఆశిస్తోంది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనీ కలలు కంటోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్ కావడమే కాదు ఆకాంక్ష కోరిక నెరవేరేలా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus