కంగనాను అక్కున చేర్చుకొంటున్న అమీర్ ఖాన్!

  • October 17, 2017 / 06:49 AM IST

హృతిక్ రోషన్ తో కంగనాకు నిజంగా రిలేషన్ ఉందా లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం సి.బి.ఐ ఎంక్వైరీ వేసినా తేలేలా లేదు. అయితే.. ఆ ఇష్యూ కారణంగా కంగనా మాత్రం బాలీవుడ్ లో ముఖ్యంగా ముంబైలో చాలా ప్రోబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. బాలీవుడ్ లో తన తోటి హీరోయిన్లే కంగనాను వెలి వేసినట్లుగా చూస్తున్నారు. ఈమధ్య పబ్లిక్ ఈవెంట్స్ కు కానీ.. పర్సనల్ పార్టీస్ కి కానీ కంగనాను ఇన్వైట్ చేయడం మానేశారట బాలీవుడ్ జనాలు. అయితే.. ఎప్పట్లానే కంగనా ఈ విషయాన్ని చాలా ఈజీగా తీసుకొని తన పని తాను చేసుకొంటూ ముందుకెళుతోంది.
అయితే.. ఈ విషయంలో బాలీవుడ్ జనాలకు మొట్టికాయలు వేయడమే కాదు, కంగనాను అక్కున చేర్చుకొన్నాడు అమీర్ ఖాన్. ఆయన స్వయంగా నిర్మించడంతోపాటు కీలకపాత్ర పోషించిన “సీక్రెట్ సూపర్ స్టార్” అక్టోబర్ 19న దీపావళి కానుకగా విడుదలకానుండగా.. తన ఆత్మీయుల కోసం సన్నిహితుల కోసం స్పెషల్ షో వేశారు. ఆ షోకు బాలీవుడ్ హీరోయిన్స్ లో కంగనాకు తప్ప మరెవరికీ ఇన్విటేషన్ లేదు. కంగనాను బాలీవుడ్ జనాలు ఇలా వదిలేయడం సరికాదు, అందుకే నేను ఆమెను సపోర్ట్ చేస్తున్నాను అంటూ మీడియాకి సమాధానమిచ్చాడు అమీర్ ఖాన్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus