ప్రభాస్ చిత్రంపై ఆసక్తి కనబరిచిన అభిషేక్ బచ్చన్

  • September 1, 2018 / 12:16 PM IST

తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. బాహుబలి తర్వాత పరభాషా సినీ ప్రముఖులకు తెలుగు సినిమా అంటే గౌరవం పెరిగింది. మన సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరచడమే కాదు.. వాటిని రీమేక్ చేయాలనీ ఆశపడుతున్నారు. ఆ జాబితాలో బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉండడం విశేషం. గ్రాండ్ గా బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ మొదట్లో విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత సరైన హిట్ లేకపోవడంతో కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంటూ.. తెలుగు చిత్ర పరిశ్రమపై తన అభిప్రాయాన్ని చెప్పారు.

“ఏ భాష‌లో మంచి సినిమాలు వ‌చ్చినా త‌ప్ప‌కుండా చూస్తుంటా. ఇంత‌కుముందు తెలుగు సినిమాలు చాలా ఎక్కువ‌గా చూసేవాణ్ని. ఇప్పుడు కొంచెం బిజీగా ఉండ‌డం వ‌ల్ల కుద‌ర‌లేదు. కొన్ని రోజుల క్రితం వ‌చ్చిన “ఛ‌త్ర‌ప‌తి” సినిమా బాగా ఇష్టం. హిందీలో రీమేక్ చేసే అవ‌కాశం వ‌స్తే ఆ సినిమానే ఎంచుకుంటా. ఆ సినిమాలో కామెడీ, సెంటిమెంట్‌, యాక్ష‌న్ అన్నీ స‌మపాళ్లలో ఉంటాయి” అని అభిషేక్ వివరించారు. ప్రభాస్ కెరీర్ లో మొదటి హిట్ గా వర్షం చిత్రం నిలిస్తే.. స్టార్ ఇమేజ్ ని పెంచిన చిత్రంగా ఛత్రపతి మూవీ నిలిచింది. ఇందులో ప్రభాస్ నటన పీక్స్ లో ఉంటుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ బిగ్ బీ తనయుడు రీమేక్ చేయాలనుకోవడాన్ని చిత్ర బృందం స్వాగతిస్తోంది. అది తమకు లభించిన మరో విజయంగా భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus