Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫుడ్ డెలివరీ బాయ్‌తో జరిగిన ఘర్షణ ఘటనపై ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా హీరో అఖిల్ రాజ్(Akhil Raj) వివరణ ఇచ్చాడు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఓ వీడియోను చేసి సోషల్ మీడియాలో వదిలాడు.ఆ వీడియో ద్వారా అఖిల్ మాట్లాడుతూ.. “డెలివరీ చేయాల్సిన ఆర్డర్ మా ఇంటికి సంబంధించినది కాకపోయినా.. అడ్రస్ తప్పుగా చూసి మా ఇంట్లో పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు డెలివరీ బాయ్.ఆ తర్వాత వచ్చి మా అమ్మతో దురుసుగా, అసభ్యంగా మాట్లాడాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Akhil Raj

‘గతంలో నేను కూడా డెలివరీ ఉద్యోగాలు చేశాను, వాళ్ళ కష్టాలు నాకు తెలుసు.అలాంటి కష్టాలను అనుభవించిన తర్వాతే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. వాళ్ళని తక్కువగా చూసే మనస్తత్వం నాది కాదు. మా ఇంటికి వచ్చే డెలివరీ సిబ్బందిని గౌరవించడం మాకు అలవాటు. మా ఎదురింటి అడ్రస్ సమస్యల కారణంగా ఇదివరకు కూడా రాంగ్ డెలివరీలు వచ్చేవి. సోషల్ మీడియాలో డెలివరీ బాయ్ పూర్తిగా అమాయకుడని అంటున్నారు. నన్ను రెచ్చగొట్టి వీడియో తీస్తూ అమాయకుడిలా నటించాడు.

నాపై ఉమ్మివేసి, తర్వాత నన్నే తప్పుబట్టేలా పరిస్థితిని మార్చేశాడు. నేను కావాలని దాడి చేయలేదు, పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా నా తండ్రే నన్ను వెనక్కి లాగాడు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా.. మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలు ఏకపక్ష కథనాలు ప్రచారం చేయకూడదు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి, మా కుటుంబం తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

కానీ నిజాలు బయటకు రాకముందే తీర్పులు ఇచ్చేస్తున్నారు. అయితే ఒక సెలబ్రిటీగా నేను మరింత సంయమనంతో వ్యవహరించి పోలీసులను ఆశ్రయించి ఉండాల్సిందేమో. నా తల్లి పట్ల జరిగిన అవమానం కారణంగా ఆ క్షణంలో నేను సహనం కోల్పోయాను. అందుకే ఇదంతా జరిగింది. మీ అమ్మకి జరిగితే ఓ కొడుకుగా ఏం చేస్తారో నేను అదే చేశాను. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను’ అంటూ అఖిల్ తన వెర్షన్ చెప్పాడు.

‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus