బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ గా నాని.!

  • March 26, 2018 / 08:57 AM IST

నిన్నమొన్నటివరకూ బిగ్ బాస్ సీజన్ 2 కి ఎవరు హోస్ట్ చేస్తారా అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. అల్లు అర్జున్, నాని, రాణాల పేర్లు వినిపించినప్పటికీ.. ఫైనల్ గా నాని ఫిక్స్ అయ్యాడని అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఎగ్రిమెంట్ కూడా అయిపోయిందట. త్వరలోనే పూణేలో తన ఇంట్రడక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొననున్నాడట నాని. అయితే.. మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీయార్ కి లభించినదాంట్లో సగం మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నాడట.

ప్రస్తుతం సీజన్ 2లో పాల్గొనే మెంబర్స్ ఎంపిక జరుగుతోంది. ఫస్ట్ సీజన్ కంటే ఎక్కువ టీయార్పీ రావడం కోసం సెన్సేషనల్ సెలబ్రిటీలను సెలక్ట్ చేస్తున్నారట. వాళ్ళ ఎంపిక పూర్తవ్వగానే సీజన్ 2 ప్రమోషన్ స్టార్ట్ చేస్తారట. నాని కామెడీ టైమింగ్ కి మాములుగానే ఫిదా అయిపోతే ఆడియన్స్.. బుల్లితెరపై నేచురల్ స్టార్ చేసే హల్ చల్ కి ఏస్థాయిలో నీరాజనాలు పలుకుతారో చూడాలి.

ఇకపోతే.. నాని ప్రస్తుతం తన తాజా చిత్రం “కృష్ణార్జున యుద్ధం” రిలీజ్ మరియు నాగార్జునతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం నాని ఒక హిందీ సినిమా సైన్ చేయనున్నాడని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus