కృష్ణార్జున యుద్ధం ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ & వెన్యూ ఫిక్స్.!

  • March 26, 2018 / 07:46 AM IST

“జెండాపై కపిరాజు” అనంతరం నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం “కృష్ణార్జున యుద్ధం”. “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా” చిత్రాలతో డీసెంట్ హిట్స్ అందుకొన్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ లో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ కథానాయికలుగా నటిస్తుండగా.. హిప్ హాప్ తమిళ సంగీత సారధ్యం వహిస్తున్నాడు. విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన వస్తుండడం, సినిమా రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 12 కూడా దగ్గరపడుతుండడంతో.. సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.

అందుకోసం వెన్యూ, డేట్ ఫిక్స్ చేశారు. తిరుపతిలో మార్చి 31న “కృష్ణార్జున యుద్ధం” ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. తిరుపతిలోని మున్సిపల్ గ్రౌండ్స్ ఈ ఈవెంట్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి “మిడిల్ క్లాస్ అబ్బాయి” హిట్ అయినా విమర్శకుల నుంచి మాత్రం “గెటప్ కూడా మార్చడం లేదు, అదే తరహా నటన” అంటూ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని “కృష్ణార్జున యుద్ధం” చిత్రంలో మాత్రం నటుడిగా తన సత్తా చాటడంతోపాటు తన కామెడీ టైమింగ్ లో సరికొత్త యాంగిల్ చూపించనున్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus