‘ముద్ర’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!

  • January 9, 2019 / 09:19 AM IST

డిఫరెంట్ చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ‘హ్యాపీ డేస్’ చిత్రంలో నటించిన హీరోల్లో నిఖిల్ ఒక్కడే నిలదొక్కుకున్నాడని చెప్పాలి. మొదట్లో ‘అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్’ ‘ఓం శాంతి’ ‘ఆలస్యం.. అమృతం’ ‘వీడింతే’ వంటి చిత్రాలతో తడబడినా.. ‘యువత’ ‘కలవర్ కింగ్’ వంటి చిత్రాలతో పర్వాలేదనిపించాడు. ఇక ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక 2018 లో వచ్చిన ‘కిరాక్ పార్టీ’ చిత్రం తరువాత తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ‘ముద్ర’ ‘శ్వాస’ అనే చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. వీటితో పాటు కిషన్ కట్టా దర్శకత్వంలో మరో చిత్రాన్ని లైన్లో పెట్టాడు. అంతేకాదు ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే నిఖిల్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలవుతుందని సమాచారం. ఇక చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను జనవరి 10 న చెబుతానని నిఖిల్ ట్విట్టర్లో ప్రకటించాడు. దీనితోపాటు ‘ముద్ర’ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తానన్నాడు. ఏదేమైనా 2019 లో మూడు సినిమాలతో నిఖిల్ సందడి చేయనున్నట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus