“మెగాస్టార్ గారి 150 వ సినిమాలో నటించడం నా అదృష్టం. సీన్స్ తీసెయ్యడం నా దురదృష్టం. సంక్రాంతి రోజున మా అమ్మ చచ్చిపోయినంత బాధగా ఉంది” అంటూ హాస్యనటుడు పృధ్వి నిన్న సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హంగామా సృష్టించింది. అవకాశాలన్నీ లాక్కొని పోతున్నాడని ఎప్పటినుంచో కోపంగా ఉన్న బ్రహ్మానందం ఇప్పుడు చిరంజీవికి చెప్పి పృధ్వి పై పగ తీర్చుకున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకున్నారు. పృధ్వి కి చిరు ఎందుకు అన్యాయం చేశారు? అని మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు పృద్వి ఈరోజు మీడియా ముందుకు వచ్చారు.
“నాకు చిరు సినిమాలో అవకాశం అనగానే ఎగిరి గంతేసి వెళ్ళాను. ఒక రోజు షూటింగ్ చేశారు. అయితే ఆ సీన్ కథకి అవసరం లేదని తెలిసి తొలిగించారు. బాధతో ఆపోస్టు చేసాను” అని హాస్యనటుడు వివరించారు. దీనిపై సోషల్ మీడియాలో రేగిన దుమారాన్ని టీ కప్పులో తుఫాన్ గా ఆయన అభివర్ణించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.