ప్రేమ వ్యవహారమే…విడాకులకు కారణమా???

Advertisement

టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య ఏదో ఒకటి ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. అయితే కొందరు వాటిని తీసే పారెస్తారు. మరికొందరు దొరికిందే అవకాశంగా ఆ రూమర్స్ ను ఉపయోగించుకుని దూసుకుపోతారు. ఇదిలా ఉంటే..ఆ మధ్య ఒక హీరోయిన్ సినీ పరిశ్రమకు చెందిన ఒక సినిమా వేత్తని పెళ్లి చేసుకుంది, మొగుడు పెళ్లాలు ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పనిచేస్తే లేని బాధ ఒకే ఇండస్ట్రీలో ఉంటే వస్తుంది అని పాపం వారికి తెలీదు…అదే క్రమంలో పెళ్లి తరువాత సినిమాలు చేసేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు మన వాడు.

ఇదిలా ఉంటే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, ఈ మధ్య నువ్వు సినిమాల్లో చెయ్యడానికి వీల్లేదు అంటూ హుకుం జారీ చేసాడంట…అయితే, మ్యారేజ్ అయిన త‌ర్వాత కూడా న‌టించ‌డం ఇప్పుడు ఆయ‌న గారి ఫ్యామిలీకి పెద్ద ఇబ్బందిగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపాడు. ఇక ఈ నిర్ణయానికి షాక్ అయిన హీరోయిన్ ఆయనకు విడాకుల కాగితాలు పంపి రివర్స్ షాక్ ఇచ్చిందట. ఇంతవరకూ బాగానే ఉన్నా…అసలు విషయం ఏమిటంటే…ఈ విడాకులకు అసలు కారణం ఆ కుర్రాడి ఫ్యామిలీ కాదు…ఒక ప్రముఖ హీరో అని తెలుస్తుంది. స‌ద‌రు హీరోయిన్‌కి ఆమెకి పాపులారిటీ వ‌చ్చిన చిత్ర పరిశ్ర‌మ‌లోనే ఓ హీరోతో ప‌ర్స‌న‌ల్ బాండింగ్ ఏర్పరుచుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోగుట్టు. ఏది ఏమైనా…మొత్తానికి వారి ప్రేమ పెళ్లి పెటాకులు అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus