సినిమా పరిశ్రమ అంటేనే అందాల ఆరబోత అన్న తప్పుడు ప్రచారం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే…సినిమా పరిశ్రమలో తారలు అందాల ఆరబోత చెయ్యక పోతే సక్సెస్ కాలేరు అన్న విమర్శ సైతం సగటు ప్రేక్షకుల్లో ఉంది. ఇక అదే క్రమంలో సినిమా తారలు సైతం అక్కడ నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా అందాల ఆరబోతకు, అటువంటి పాత్రలకే ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇఛెస్తున్నరు.
అదే క్రమంలో సక్సెస్ లు కూడా కొడుతున్నారు. ఇదిలా ఉంటే అందరిలాగా కాకుండా…అందరిలో ఒక్కరిగా ఉంటాను అంటుంది తమిళ హీరోయిన్ ఆనంది. త్రియ లేదా నయనతార, పొరియాళన్, చండీవీరన్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో నటించిన ఈ భామ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో పడిన ఇబ్బందుల గురించి వివరిస్తూ…ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డానని.
అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి తెచ్చారని. చివరకు తాను అలా నటించేదిలేదని, కాదంటే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాల్సి వచ్చిందట. అప్పుడు గానీ తనపై ఒత్తిళ్లు తగ్గలేదట. అప్పటికీ…ఇప్పటికీ తనలో ఏ మార్పు లేదని, అలా ఆ పాత చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధ పడింది ఈ బ్యూటీ. ఏది ఏమైనా.. అందరూ ఒకేలా ఉండరు అని మరోసారి తెలిసిపోయింది.