పెళ్ళైనా… గ్లామర్ పాత్రలు చేస్తాను : అంజలి

‘ఫోటో’ చిత్రంతో తెరంగేట్రం చేసినా.. ఆ చిత్రం సరైన హిట్టవ్వలేదు. దీంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ ‘షాపింగ్ మాల్’ ‘జర్నీ’ వంటి చిత్రాలు హిట్టవ్వడంతో టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ఛాన్స్ దక్కింది. ఆ చిత్రం మంచి హిట్టవ్వడంతో… అంజలికి మంచి అవకాశాలు దక్కాయి. ‘మసాలా’ ‘గీతాంజలి’ ‘డిక్టేటర్’ ‘శంకరా భరణం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇవేమీ హిట్టవ్వకపోవడంతో మళ్ళీ కోలీవుడ్ బాట పట్టింది.

అయితే గతంలో హీరో జై తో ప్రేమాయణం నడిపిందని.. త్వరలోనే వీరిద్దరి పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేదని కొట్టి పారేసింది అంజలి. ఇప్పుడు మరోసారి అంజలి పెళ్ళి వార్తలు మొదలయ్యాయి. అయితే ఈసారి ఆ వ్యక్తి పేరు బయటకి రాలేదు. త్వరలోనే అంజలి పెళ్ళి చేసుకుని సినిమాలకి గుడ్ బై చెప్పనుంది టాకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలకి అంజలి కాస్త గట్టిగానే బదులిచ్చింది.. “నేను త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నానే వార్తల్లో అస్సలు నిజం లేదు. ఇప్పట్లో నాకు పెళ్ళి పై దృష్టి లేదు. ఒక వేళ పెళ్ళైనా సినిమాలు మానెయ్యను. పెళ్ళైన తరువాత కూడా గ్లామర్ పాత్ర వస్తే చేయడానికి నేనెప్పుడూ రెడీ” అంటూ ఘాటుగా స్పందించింది మన సీతమ్మ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus