ఆటపాటల నడుమ వేడుకగా నటి అర్చన సంగీత్!

  • November 12, 2019 / 03:16 PM IST

తెలుగు అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పారిశ్రామికవేత్త జగదీష్‌తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు.

వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.


17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus