కోకాపేట్ లో కొత్త ఇల్లు కొనుక్కున్న కేతరీన్

  • December 26, 2018 / 12:38 PM IST

ఈమధ్యకాలంలో తెలుగులో సినిమాలు లేకపోయినప్పటికీ.. హైద్రాబాద్ లోనే స్థిరపడి టాలీవుడ్ లో అవకాశాల కోసం అర్రలు చాచి కూర్చున్న కథానాయికల్లో కేతరీన్ ఒకరు. అలాగని ఆమెకు వేరే అవకాశాలు లేవా అంటే కాదు.. తమిళనాట ఆమె ఫుల్ బిజీ హీరోయిన్. కానీ తెలుగులో మాత్రం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. అమ్మడు రీసెంట్ గా కోకాపేట్ లో ఒక కొత్త ఇల్లు కొనుక్కుందట. పాపం చాన్నాళ్లుగా ఎంతో కష్టపడి ఒక్కోపైసా కూడబెట్టుకొని కేతరీన్ ఈ ఇల్లు కొనుక్కోందట. కానీ.. ఇండస్ట్రీలో కొందరు ఈ ఇంటిని ఎవరో హీరో కొనిచ్చాడని ప్రచారం చేస్తుండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో తనకు తెలిసిన మీడియావారికి కాల్ చేసి మరీ ఈ ఇల్లు నా డబ్బుతో కొనుక్కున్నది అని చెబుతోందట. పాపం తాను కష్టపడి కొనుక్కున్న ఇంటి క్రెడిట్స్ కూడా తనకు దక్కపోవడం ఎంత అన్యాయమో కదా.

ఇకపోతే.. కేతరీన్ ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ, తమిళంలో ఒక మూడు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో తెరకెక్కుతున్న అత్తారింటికి దారేది రీమేక్ లోనూ శింబు సరసన నటిస్తోంది కేతరీన్. తెలుగులో ప్రణీత పోషించిన పాత్రను తమిళంలో కేతరీన్ ప్లే చేస్తోంది. ఈ సినిమా తన కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉంది కేతరీన్. ఇదే తరహాలో ఆమెకు తెలుగులోనూ అవకాశాలొస్తే బాగుండు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus