నిర్మాతను నమ్ముకున్న హీరోయిన్ కెరీర్ నాశనం అయ్యింది

Advertisement

ఆయన ఓ బడా ప్రొడ్యూసర్, అమ్మాయి అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన పడుచు పిల్ల. ఎందుకు తలొగ్గిందో తెలియదు కానీ.. ఆ ప్రొడ్యూసర్ కి సరెండర్ అయిపోయింది. ఆ బడా ప్రొడ్యూసర్ నిర్మాణంలో చేస్తున్నప్పుడు అదే బ్యానర్ లో మరో రెండు సినిమా చేయిస్తానని చెప్పాడట ఆ ప్రొడ్యూసర్.. దాంతో కుదిరితే అతడి దగ్గరే సెటిల్ అయిపోదామనుకుంది. కానీ.. అదృష్టం బాగోక ఆ సినిమా కాస్తా డిజాస్టర్ అయ్యింది. అయితే.. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ ప్రొడ్యూసర్ ఆమెకి అవకాశాలు ఇస్తాడేమో అనుకుంది ఆ అమ్మడు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. సినిమా డిజాస్టర్ అవ్వడమే కాక హీరోయిన్ కి రివ్యూల్లో నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆమెను పక్కనేట్టేశాడు నిర్మాత.

దాంతో దిక్కుతోచని స్థితిలో మొదట్లో ఎప్పుడో మొదలెట్టిన ప్రొజెక్ట్ ను కంప్లీట్ చేసి ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తోంది సదరు కొత్త హీరోయిన్. అయినా.. స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్ నే ఈ బడా నిర్మాతలు పెద్ద పట్టించుకోరు. అలాంటిది ఈ కొత్తమ్మాయి మరీ అంత గుడ్డిగా ఎలా నమ్మేసిందో ఏంటో. పాపం ఇప్పుడు అటు సినిమాలు లేక, ఇటు ఆదరించే నాధుడు లేక చాలా ఇబ్బందులు పడుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus