ఇండస్ట్రీలో కొందరు ఫైర్ బ్రాండ్ ఆర్టిస్టులుంటారు. వారిలో హేమ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి నటించిన “క్షణం” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హేమ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ కమెడియన్ గా వందల సినిమాల్లో నటించింది. అయితే.. ఈమధ్యకాలంలో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఆమె ఇంతకుముందు చాలా రెగ్యులర్ గా కనిపించేది కానీ.. ఈమధ్యకాలంలో ఆమె ఆయన సినిమాల్లో కనిపించడం లేదు. అందుకు కారణం ఏంటా అని ఆమెను ప్రశ్నించగా.. “త్రివిక్రమ్ సినిమాల్లో నేను చాలా రెగ్యులర్ గా నటించేదాన్ని, కానీ జులాయి తర్వాత ఒక సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను చెప్పిన రెమ్యూనరేషన్ ఆయనకి నచ్చలేదు.
వెంటనే ఈవిడకి ఇంత రెమ్యూనరేషన్ ఎందుకు అని ప్రశ్నించడమే కాక తగ్గించుకోమని చెప్పాడు. అది నాకు నచ్చలేదు. ఆయనెవరు చెప్పండి నా రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి అని నేను సీరియస్ అయ్యాను. అప్పట్నుంచి ఆయన సినిమాల్లో నేను నటించడం లేదు” అని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఒకసారి షూటింగ్ సమయంలో బోయపాటి తనపై కుళ్ళు జోక్ వేస్తే వెంటనే రీటార్ట్ ఇచ్చిందట హేమ. ఇలా తాను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరికీ గట్టిగానే ఇచ్చానని గొప్పగా చెప్పుకొచ్చింది హేమ. హేమ ఉన్నట్లుండి ఇలా ఓపెన్ అప్ అవ్వడం పట్ల కొందరు డౌట్ పడుతున్నారు. అవకాశాల్లేక ఇలా చేస్తోందా తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న టెన్షన్ తో ఇలా మీడియాలో హైలైట్ అవ్వడం కోసం తాపత్రయపడుతుందా అనేది తెలియాలి.