క్లారిటీ ఇచ్చినా.. కాన్ఫ్యూజన్ లో పడేసిన ‘హలో’ భామ..!

Advertisement

అఖిల్ హీరోగా విభిన్న చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘హలో’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శిన్. మొదటి చిత్రంతోనే నటిగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అటుతరువాత వచ్చిన సాయితేజ్ ‘చిత్రలహరి’ తో కూడా డీసెంట్ హిట్ ను అందుకుంది. అయితే ఇటీవల విడుదలైన ‘రణరంగం’ చిత్రం మాత్రం ఈమెకు చేదు ఫలితాన్నే ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ అమ్మడు హీరోయిన్ కాక ముందునుండే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసింది. ‘క్రిష్ 3’ చిత్రానికి సాబు సిరిల్ వద్ద పని చేసిన కళ్యాణి తరువాత దర్శకుడు విక్రమ్ సినిమాకి కూడా అసిస్టెంట్ కళా దర్శకురాలిగానూ పనిచేసింది. ఎలాగు తండ్రి ప్రియదర్శన్ పెద్ద డైరెక్టర్ కాబట్టి ఈమె కెరీర్ ప్రస్తుతం బాగుంది. కళ్యాణి ప్రస్తుతం శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోతో నటిస్తుంది. అలాగే మలయాళంలో తన తండ్రి ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘మరక్కార్’ అనే చిత్రంలోనూ ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది అమ్మడు.

ఇక పెళ్ళి విషయమ్లో ఈ అమ్మడు హింట్లు ఇస్తుంది కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో నిజం లేదని కళ్యాణి కొట్టి పారేసి కొత్త విషయం తెలిపింది. ‘నేను ఓ కుర్రాడితో డేటింగులో ఉన్నా… అతడినే పెళ్ళాడతా… అయితే దానికి ఇంకా చాలా టైం ఉంది. నేను డేటింగులో ఉన్న కుర్రాడు ఎవరో నా కుటుంబంలో అందరికీ తెలుసు. ఇంట్లో అందరికీ అంగీకారమే… కాబట్టి పెళ్ళికి అభ్యంతరాలేవీ ఉండవు’…. అంటూ విచిత్రమైన క్లారిటీ ఇచ్చింది.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus