సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందే హీరోయిన్ కి మరో అవకాశం రావడం అనేది చాలా అరుదైన విషయం. కానీ.. తమిళ కుట్టి మేఘ ఆకాష్ తాను నటించిన మొదటి తమిళ సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వకముందే తెలుగులో నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు సైన్ చేసింది. ఆ సినిమాలు విజయం సాధిస్తే తెలుగులోనే స్థిరపడాలని కూడా భావించింది. కానీ.. ఆమె అదృష్టం కలిసిరాక నితిన్ తో కలిసి నటించిన రెండు సినిమాలు హిట్ అవ్వలేదు. పైగా.. అమ్మడి పెర్ఫార్మెన్స్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇక్కడ కంటిన్యూ అవ్వాలా లేక తమిళానికి తిరిగి వెళ్లిపోవాలా అనే కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతుంది మేఘ ఆకాష్.
ఇకపోతే.. ఆల్రెడీ ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకొన్న రెండు సినిమాల దర్శకనిర్మాతలు కూడా “చల్ మోహన్ రంగ” సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కు వచ్చిన రివ్యూలు చూసి పునరాలోచనలో ఉన్నారట. దాంతో ఈ సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ కూడా పెంచేద్దామని బోలెడు ప్లాన్స్ వేసుకొన్న మేఘ ఆకాష్ నెక్స్ట్ స్టెప్ ఎంటనే విషయంలో క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అవుతోందట.