కొంచెం ఆనందం.. కొంచెం బాధ అనే రీతిలో మెహ్రీన్ కెరీర్ సాగుతోంది. ఓ వైపు రాజా ది గ్రేట్, మహానుభావుడు చిత్రాలతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ కేరాఫ్ సూర్య, పంతం, జవాన్ సినిమాలతో అపజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూవీ నోటా లో నటించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ రేపు థియేటర్లోకి రానుంది.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తన కెరీర్ కి ఉపయోగపడుతుందని మెహ్రీన్ ఆశపడుతోంది. అయితే ఈ సినిమా విజయం సాధించినా.. అపజయం పొందినా మెహ్రీన్ పై ప్రభావం ఏమి ఉండదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే ఈ చిత్రంలో మెహ్రీన్ జర్నలిస్టు పాత్ర పోషిస్తోంది. అది సైడ్ క్యారెక్టర్‌కి ఎక్కువ.. హీరోయిన్‌కి తక్కువ. విజయ్ దేవరకొండకీ మెహ్రీన్ కి మధ్య ఎలాంటి రొమాన్స్ సన్నివేశాలు ఉండవని టాక్. ఆడియో చూస్తే ఇద్దరి మధ్య సాంగ్ కూడా ఏమీ లేదని తెలిసిపోయింది. ఇది సీరియస్ గా సాగే పొలిటికల్ డ్రామా. కథ ఒక్కసారి పొలిటికల్ డ్రామాలోకి ప్రవేశించగానే.. పాలిటిక్స్ తప్ప ఏమీ కనిపించవు. మెహ్రీన్ కూడా సీరియస్‌గా జర్నలిస్టు పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతుందంతే. కాబట్టి మెహ్రీన్ చేసిన సినిమాల కౌంట్ పెరగడం తప్పించి… నోటా తో ఆమెకి వచ్చే లాభం ఏమీ లేదు.