తనని ఇష్టపడిన వారి గురించి చెప్పిన నిత్యామీనన్!

  • July 11, 2018 / 10:00 AM IST

“అలా మొదలయింది..” సినిమా నుంచి మొన్నటి “అ” చిత్రం వరకు నిత్యా మీనన్ నటనకు వంకలు పెట్టలేము. అందాల ఆరబోత కన్నా అభినయాన్ని నమ్ముకుని విజయాలను సొంతం చేసుకుంటోంది. తనకి నచ్చిన, నప్పిన కథలను ఎంచుకుంటూ దక్షిణాదిలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె ఆసక్తికర సంగతులు చెప్పింది. ప్రేమ గురించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించింది. “ప్రేమ అంటే ఎటువంటి నిబంధనలు లేనిది. నాకు స్కూల్లో ఇద్దరు ప్రపోజ్ చేశారు. కానీ నేను ఏంటి..?. ఏం మాట్లాడుతున్నావు..? అలా ఎలా చెప్పగలవు?” అని అన్నాను.

ఆ తర్వాత ఎవరూ దైర్యం చేయలేదు” అని అన్నారు. చిన్నప్పుడు ఏ హీరోపైనా ప్రేమను పెంచుకున్నారా? అంటే అందుకు ఆలోచించకుండానే తమిళ స్టార్ హీరో అర్జున్ పేరు చెప్పారు. ప్రస్తుతం మిమ్మల్ని నిద్ర పోనీయకుండా చేసే ఆలోచన ఏమిటని అడగగా.. “హాలీవుడ్ హీరో లియోనార్డో డి కాప్రియాతో సినిమా చేస్తానని తెలిసినప్పుడు నాకు నిద్ర పట్టదు” అని అన్నారు. ఇంకా తనకి అన్నం పప్పు అంటే చాలా ఇష్టమని, అలాగే తన ఇంట్లో డైనింగ్ రూమ్ లో కూర్చొని పక్షులను చూడడం మరింత ఇష్టమని నిత్యామీనన్ వెల్లడించింది. ఆమె రెండు  భారీ ప్రాజక్ట్స్ లో భాగమైంది. అవి ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉండడం వల్ల అధికారికంగా ప్రకటించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus