Poojitha, Naresh: నరేష్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పిన నటి పూజిత ..!

కామెడీ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందుకున్న నరేష్.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. దాదాపు 40 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్న నరేష్ ‘మా’ అసోసియేషన్ ద్వారా కూడా స్ట్రాంగ్ సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో అతని పై ట్రోలింగ్ జరిగినా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటులు అంతా నరేష్ తో బాగానే సన్నిహితంగా ఉంటారు. అయితే పవిత్ర లోకేష్ విషయంలో అతని భార్య రమ్య రఘుపతి చేస్తున్న ఆరోపణలను ఖండించడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. నరేష్ గెలిపించిన ప్యానలే ఇప్పుడు అధికారంలో ఉంది కదా..!

అందులోని సభ్యులు ఎందుకని నరేష్ ను వెనకేసుకురావడం లేదు అనే చర్చ ఊపందుకున్న వేళ ఒకప్పటి నటి పూజిత.. నరేష్ కు మద్దతు పలుకుతూ ఉండడం విశేషం. ఆమె మాట్లాడుతూ.. “నరేష్ ఉమెనైజర్ అంటూ అతని భార్య రమ్య రఘుపతి అంటున్నారు. అయితే నేను కొన్ని సంవత్సరాల ముందు వరకూ హీరోయిన్‌గా నటించాను.చాలా సినిమాల్లో నటించాను. నేను బాగానే ఉన్నాను కదా.. నా ముక్కు మొహం అన్నీ బాగానే ఉన్నాయి కదా.. నేను హీరోయిన్‌గా తెలుగులోనే కాకుండా కర్ణాటకలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాను. నరేష్‌తో నేను కలిసి నటించాను.ఆయన నిజంగా ఉమనైజర్ అయితే.. నన్ను కూడా అడగాలి కదా..

నరేష్ ఉమనైజర్ అయితే ‘పూజా ఎక్కడికైనా వెళ్దాం అని’ అడిగే వారు కదా.. కానీ ఆయన అలా అడగలేదు. నేను అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలైతే.. ఆదుకున్నారు నరేష్. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయనవల్లే.. ఆరోజు ఆయన కనుక నాకు సాయం చేయకపోతే.. నేను ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు. నాలాగే ఆయన వల్ల సాయం పొందిన వాళ్లు 1000 నుంచి 1500 మంది ఉన్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు.. నాకు మాత్రమే తెలుసు. దీన్ని నేను కెమెరా ముందు చెప్పాలనుకున్నప్పుడు కూడా ఆయన వెనుక నుంచి వద్దు పూజ.. వద్దు పూజ.. నువ్ ఒక హీరోయిన్‌వి డీగ్రేడ్ అవుతావ్ అని అనేవారు.

కానీ నేను చెప్తా.. ఆయన వ్యక్తిత్వం పై కొట్టారు కాబట్టి నా అంతట నేనే కర్ణాటక వెళ్లాను.. మీడియాతో మాట్లాడాను. తెలుగులో ఎలాగూ రచ్చ చేశారు.. కర్ణాటకలో ఎందుకు చేస్తున్నారు? నిజానికి నేను షూటింగ్‌లో ఉన్నాను.. ఈ విషయం తెలిసిన తరువాత నేను వెంటనే కర్ణాటక వెళ్లి.. నా బ్రదర్‌కి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని అనుకున్నాను. దీని వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు.. కేవలం మానవత్వంతో స్పందిస్తున్నా. నా లాంటి వాళ్ళు బతికి ఉండాలంటే మా బ్రదర్ బతికే ఉండాలి.నరేష్ వాళ్ళ ఇంటికి వందమంది వెళ్తే నాలుగు రకాల కూరలతో భోజనం చేస్తూ ఉంటారు.

మీరు ఏ టైం లో అయినా వెళ్లండి. వాళ్లు కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని నానా మాటలు అంటున్నారు. నరేష్ గారు నిజంగా అలాంటి వ్యక్తి అయితే.. ఇండస్ట్రీలో 36 ఏళ్లు గా ఉన్నారు.. ఒక్క అమ్మాయి అయినా కంప్లైంట్ చేసిందా? ఆయన వయసు ఇప్పుడు యాభై పైనే.. ఎవరైనా ఆయన అలాంటి వాడు అని చెప్పారా? నరేష్ గారు అలాంటి వ్యక్తి కాదు. ఇక పవిత్రా లోకేష్ ను ఈ వివాదంలోకి లాగడం నాకు ఇష్టం లేదు.

ఆడది అనేసరికి నాలుగు రాళ్లు వేయడానికి అందరూ రెడీగా ఉంటారు. నా జీవితంలోనూ ఇలాగే జరిగింది. ఏ ఆడది హ్యాపీగా ఉన్న లైఫ్‌ని దూరం చేసుకోరు. ఒకరు ఉండగా.. ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు చూడండి.. అప్పుడే సమస్యలు వస్తుంటాయి. పవిత్రా లోకేష్ భర్త కూడా ఆమెపై ఆరోపణలు చేశారు.. నిజానికి వాళ్లకి లీగల్‌గా మ్యారేజ్ కాలేదన్నది నా దగ్గర ఉన్న సమాచారం’ అంటూ నరేష్, పవిత్ర లను వెనకేసుకొచ్చింది పూజిత.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Share.