పూనమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

  • May 11, 2020 / 02:46 PM IST

తాజాగా పూనమ్ ను పోలీసులు అరెస్ట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. పూనమ్ అంటే మన పూనమ్ కౌర్ అని కంగారు పడకండి. ఈమె బాలీవుడ్ నటి పూనమ్ పాండే. నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలవడం ఈ బ్యూటీకి అలవాటే. అంతేకాదు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… నెటిజెన్లకు కావాల్సినంత ఐ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే… ఈసారి ఏకంగా పోలీసులు ఈమెను అరెస్ట్ చేసి … కేసు పెట్టడం వరకూ వెళ్ళింది మ్యాటర్.

వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు ఇండియా మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో పూనమ్…తన బీఎండబ్ల్యూ కారులో ముంబై మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో హాయిగా షికార్లు కొడుతుందట. అలా పోలీసుల కంటపడింది. ఈమె లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇలా తిరిగినందుకు ఈమెను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసారు పోలిస్ లు. అంతేకాదు ఈమె కారుని కూడా స్టేషన్ కు తరలించారు. ఈ విషయాన్ని స్వయంగా …\

ముంబై సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ మృత్యుంజయ్ హీరేమత్ మీడియాకు చెప్పుకొచ్చారు. పూనం పాండేతో పాటు కారులో ఉన్న ఆమె స్నేహితుడు శామ్ అహ్మద్ బాంబే అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి… అతని పై కూడా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతుంది. మరి పూనమ్ ఈ విషయం పై ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus