Poonam Kaur: పెళ్లి వార్తల గురించి పూనమ్ కౌర్ రియాక్షన్ ఇదే!

  • October 15, 2022 / 03:37 PM IST

తెలుగులో పూనమ్ కౌర్ చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా వేర్వేరు వివాదాస్పద విషయాల ద్వారా పూనమ్ కౌర్ పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. తాజాగా పూనమ్ కౌర్ పెళ్లి జరిగిందని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. కర్వా చౌత్ పండుగ సందర్భంగా పూనమ్ కౌర్ షేర్ చేసిన ఫోటో వల్ల పూనమ్ కౌర్ పెళ్లి గురించి కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. అయితే తాజాగా ఈ కామెంట్ల గురించి రియాక్ట్ అయిన పూనమ్ కౌర్ ఘాటుగా జవాబిచ్చారు.

కర్వాచౌత్ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు తమకు కాబోయే భర్తల కోసం జరుపుకుంటారని ఆమె అన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారని పూనమ్ కౌర్ కామెంట్లు చేశారు. ఎందుకు తన పెళ్లి గురించి ఆర్టికల్స్ వైరల్ అవుతున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. వైరల్ అయిన ఆర్టికల్స్ రాజకీయపరమైన కారణాలతో వైరల్ అవుతున్నాయో లేక మిషనరీ ఆలోచనా విధానంలో సంధించబడ్డాయో తనకు అర్థం కావడం లేదని పూనమ్ కౌర్ కామెంట్లు చేశారు.

ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అంటూ పూనమ్ కౌర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. వైరల్ అయిన వార్తలు పూనమ్ కౌర్ ను హర్ట్ చేశాయని ఆ కారణం వల్లే పూనమ్ కౌర్ ఇంత ఘాటుగా రియాక్ట్ కావాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.

మరోవైపు పూనమ్ కౌర్ గతంలో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పూనమ్ కౌర్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూనమ్ కౌర్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు,

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus