ఇక్కడ ర్యాగింగ్ కుదరదంటున్న ప్రగతి…!

హీరోయిన్ లకు మాత్రమే కాదు… కొందరు సీనియర్ ఆర్టిస్ట్ లకు కూడా సోషల్ మీడియా పెద్ద దిక్కు అయిపొయింది. మేము కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తీసిపోము అంటూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు కొందరు సీనియర్ నటీమణులు. ఇప్పటికే సురేఖ వాణి సోషల్ మీడియాని ఏలుతుంది. ఇక హీరోయిన్ల తల్లి పాత్రలు చేసే ప్రియకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళు నటించే సినిమాల్లోని ఆన్ సెట్స్ ఫోటోలతో పాటు..

పర్సనల్ ఫొటోస్ ను కూడా షేర్ చెయ్యడం … అలాగే అభిమానులతో చిట్ చాట్ చెయ్యడం… లైవ్ లు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రగతి కూడా చేరింది. సినిమాల్లో ఎంతో పద్దతిగా కనిపించే ఈ సీనియర్ బ్యూటీలో ఇంత హాట్ నెస్ ఉందా అనేంతలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఇండియా వైడ్ లాక్ డౌన్ ఉంది… దీంతో ఎలాగూ షూటింగ్ లు లేవు.. ఈ గ్యాప్ ను వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది ప్రగతి.

భవిష్యత్తులో గ్లామర్ మరియు కొన్ని బోల్డ్ పాత్రలకు కూడా ఓకే చెప్పడానికి ఈమె రెడీ అవుతుందట. పాత్రకి ప్రాముఖ్యత ఉంటే.. వెబ్ సిరీస్ లు చెయ్యడానికి కూడా ఈమె రెడీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె వర్కౌట్ లు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటికి దర్శకురాలు నందినీ రెడ్డి… ‘మడత పెట్టడం అంటే ఇదేనా’ అని కామెంట్ పెట్టింది. దీనికి ప్రగతి.. ‘ఇక్కడ ర్యాగింగ్ చెయ్యడం కుదరదు’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది ప్రగతి.

1

2

3

 

4

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus